Harom Hara : సుధీర్ బాబు ‘హరోంహర’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. కనులెందుకో..

సుధీర్ బాబు ‘హరోంహర’ నుంచి 'కనులెందుకో' అనే మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Harom Hara : నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం ‘హరోంహర’. 1980’s బ్యాక్‌డ్రాప్‌ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రూరల్ గ్యాంగ్ స్టార్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సెహరి’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ టైటిల్ సాంగ్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

తాజాగా ఈ మూవీ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘కనులెందుకో’ అంటూ సాగే మెలోడీ పాటని సుధీర్ అండ్ మాళవిక పై అందంగా చిత్రీకరించినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటకి వేంగి సుధాకర్ లిరిక్స్ రాయగా, నిఖిత శ్రీవల్లి పాటని పాడారు. మరి ఆ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని మీరు కూడా వినేయండి.

Also read : Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ వినగానే ఆ హీరోని అనుకున్నారట.. కానీ తరువాత నరేష్..

కాగా ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి ప్లాప్ ల్లో ఉన్న సుధీర్ బాబు ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడేమో చూడాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం.. మే నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు