Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ వినగానే ఆ హీరోని అనుకున్నారట.. కానీ తరువాత నరేష్..

'ఆ ఒక్కటీ అడక్కు' కథ వినగానే నిర్మాత ఆ హీరోని అనుకున్నారట. కానీ ఆ తరువాత అల్లరి నరేష్ తో చేసారు. ఇంతకీ ఆ హీరో ఎవరు..?

Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ వినగానే ఆ హీరోని అనుకున్నారట.. కానీ తరువాత నరేష్..

Aa Okkati Adakku producer Rajiv Chilaka about casting of Allari Naresh

Aa Okkati Adakku : అల్లరి నరేష్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ కామెడీ నేపథ్యంతో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తున్నారు. వచ్చే వారం మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో నిర్మాత రాజేష్ చిలకా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో రాజేష్ చిలకా మాట్లాడుతూ.. “ఈ సినిమా కథని దర్శకుడు మల్లి అంకం నాకు చెప్పగానే, నా మైండ్ లోకి వచ్చిన మొదటి హీరో రాజేంద్రప్రసాద్ గారు. ఆయన యంగ్ గా ఉంటే ఈ సినిమా ఆయనకి పర్ఫెక్ట్. ఇప్పుడున్న హీరోల్లో అయితే నరేష్ గారికే యాప్ట్” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ గురించి మాట్లాడుతూ.. మూవీకి టైటిల్ ఏం పెట్టాలని అందరూ ఆలోచిస్తున్న సమయంలో, ఈ టైటిల్ ని అల్లరి నరేషే సూచించినట్లు చెప్పుకొచ్చారు.

Also read : Namrata Shirodkar : గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసిన నమ్రతా.. అచ్చం మహేష్ బాబులా..

అందరూ రిలేట్ చేసుకునే పెళ్లి అనే అంశంతో వస్తున్న ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్ లు, ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లీవర్ కుమార్తె జెమి లివర్ ఓ కీలక పాత్రని చేస్తున్నారు. వెన్నల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.