Namrata Shirodkar : గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసిన నమ్రతా.. అచ్చం మహేష్ బాబులా..

గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసిన నమ్రతా. ఆ పిక్ చూస్తుంటే గౌతమ్ అచ్చం మహేష్ బాబులా..

Namrata Shirodkar : గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసిన నమ్రతా.. అచ్చం మహేష్ బాబులా..

Namrata Shirodkar Gautham Sitara ghattamaneni childhood photos

Updated On : April 25, 2024 / 5:02 PM IST

Namrata Shirodkar : సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన విషయాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ వస్తుంటారు. ఇక తాజాగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొన్ని అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసారు.

మహేష్ వారసులు గౌతమ్, సితార కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు ఎలా ఉన్నారో అనే విషయాలు రెగ్యులర్ గా తెలుస్తూ వస్తున్నాయి. కానీ చిన్నతనంలో ఈ ఇద్దరు ఎలా ఉండేవారో అనే విషయాలు కొన్ని అరుదైన ఫోటోలు ద్వారానే తెలుస్తుంటాయి. ఇలాంటి కొన్ని ఓల్డ్ మెమరీ పిక్స్ ని నమ్రతా షేర్ చేసారు.

Also read : Vijay Deverakonda : కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్.. అంటే మూవీలో గెస్ట్ రోల్ కన్ఫార్మ్..!

ఇటీవల సితార చిన్నప్పటి క్యూట్ పిక్స్ ని షేర్ చేసిన నమ్రతా.. తాజాగా గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న ఫోటోని షేర్ చేసారు. ఆ ఫొటోల్లో గౌతమ్ ని నమ్రతా ముద్దాడుతూ కనిపిస్తుంది. ఇక గౌతమ్ లుక్స్ అయితే చాలా క్యూట్ గా కనిపిస్తూ ముద్దొస్తున్నాయి. ఇక ఈ పిక్స్ ని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్.. “గౌతమ్ ని చూస్తుంటే అచ్చం చిన్నప్పటి మహేష్ నే చూసినట్లు ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రతి గురువారం నమ్రతా ఇలా ఓల్డ్ పిక్స్ ని షేర్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇది గమనించిన మహేష్ బాబు ఫ్యాన్స్.. వచ్చే గురువారం మహేష్ కి సంబంధించిన అరుదైన పిక్ ని షేర్ చేయాలంటూ కోరుతున్నారు.