Vijay Deverakonda : కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్.. అంటే మూవీలో గెస్ట్ రోల్ కన్ఫార్మ్..!

కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్. అంటే ఈ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ పక్కా అని తెలిసిపోతుంది.

Vijay Deverakonda : కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్.. అంటే మూవీలో గెస్ట్ రోల్ కన్ఫార్మ్..!

Vijay Deverakonda photo leaks from Prabhas Kalki 2898 AD movie sets

Updated On : April 25, 2024 / 4:38 PM IST

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. కానీ వాటిలో ఎంత నిజముంది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజాగా బయటకి వచ్చిన ఓ ఫోటో చూసిన తరువాత కల్కిలో విజయ్ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ అని తెలుస్తుంది.

రీసెంట్ గా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ని కల్కి మూవీ షూటింగ్ సెట్స్ లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే విజయ్ కి సంబంధించిన ఓ ఫోటో కూడా బయటకి వచ్చింది. బాలీవుడ్ కి చెందిన నటుడు అయాజ్ పాషా కల్కి సినిమాలో ఓ పాత్ర చేస్తున్నారు.

Also read : Kalki 2898 AD : కల్కి ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌లో ఇది గమనించారా.. పురాణాలకు బాగా లింక్ చేస్తున్నారుగా..

దీంతో నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఈ నటుడు కూడా పాల్గొన్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ పిక్స్ లో విజయ్ దేవరకొండ ఫోటోని కూడా షేర్ చేసారు. అయితే దానిని కొంచెం బ్లర్ చేసి పోస్ట్ చేసారు. ఆ ఫోటో కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. బ్లర్ చేయకుండా ఒరిజినల్ పిక్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసారు. ఇక ఇది చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. కల్కి విజయ్ కనిపించడం పక్కా అని ఫిక్స్ అయ్యిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ayaz Pasha (@ayaz.pasha)

కాగా ఈ సినిమాలో విజయ్ తో పాటు దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళి, ఎన్టీఆర్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి దీని పై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి సమాచారం రావాల్సిందే. కాగా ఈ చిత్రంలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి బడా తారలు కనిపిస్తున్నారు.