Kalki 2898 AD : కల్కి ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌లో ఇది గమనించారా.. పురాణాలకు బాగా లింక్ చేస్తున్నారుగా..

కల్కి 'అశ్వత్థామ' గ్లింప్స్‌లో ఇది గమనించారా. శివలింగం పై నీటి చుక్కలు ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. ఈ పాయింట్ ని కూడా పురాణాలు నుంచే తీసుకున్నారు. దాని కథేంటంటే..

Kalki 2898 AD : కల్కి ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌లో ఇది గమనించారా.. పురాణాలకు బాగా లింక్ చేస్తున్నారుగా..

Kalki 2898 AD Amitabh Bachchan Ashwatthama glimpse details link with Srikrishna words

Updated On : April 25, 2024 / 3:29 PM IST

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ.. హిందూ పురాణాలు ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే హిందూ గ్రంధాల్లో చెప్పబడిన కొన్ని పాత్రలు.. ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపించబోతున్నాయి. అయితే మేకర్స్ ఏదో ఒకటి రెండు పాయింట్స్ ని పురాణాలు నుంచి తీసుకోని సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేయడం లేదు.

పురాణాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా నేటి జనరేషన్ వారికీ తెలియజేసేలా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌ చూస్తుంటే.. మేకర్స్ పురాణాలకు సినిమాని ఎంత బాగా లింక్ చేస్తున్నారో అర్ధమవుతుంది. అమితాబ్ బచ్చన్ పాత్రని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌లో మీరు గమనిస్తే.. ఒక శివలింగానికి అశ్వత్థామ ప్రార్ధన చేస్తూ కనిపిస్తారు.

ఇక ఆ శివలింగం పై నీటి చుక్కలు ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. కానీ ఆ తరువాత ఆ నీటిబిందువులు పడడం ఆగిపోతాయి. అవి చూసిన అశ్వత్థామ.. అంతిమ యుద్ధం వచ్చిందని అంటారు. ఈ పాయింట్ ని కూడా నాగ్ అశ్విన్ పురాణాలు నుంచే తీసుకున్నారు. శ్రీకృష్ణుడు తన దశావతారం కల్కి గురించి గురించి మాట్లాడుతూ.. “గంగ, యమున, సరస్వతి నదులు నీరు లేక ఎండిపోయినప్పుడు నేను కల్కిగా అవతరిస్తాను” అని చెప్పినట్లు చెబుతారు.

Also read : Fahad Faasil : సినిమాలే లైఫ్ కాదు.. జీవితంలో చాలా ఉన్నాయి.. ఫ్యాన్ వార్స్ బ్యాచ్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఫహద్ ఫాజిల్..

ఈ పాయింట్ నే నాగ్ అశ్విన్ ఆ గ్లింప్స్ లో చూపించినట్లు పలువురు పురాణం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకుంటున్న నెటిజెన్స్.. ‘కల్కి సినిమాని పురాణాలకు బాగా లింక్ చేస్తున్నారుగా’ అంటూ మూవీ పై మరింత ఆసక్తి పెంచుకుంటున్నారు. మరి మూవీ నుంచి రాబోతున్న మరిన్ని అప్డేట్స్ ఇంకెన్ని విషయాలను చూపిస్తూ ఆడియన్స్ లో క్యూరియోసిటీని క్రియేట్ చేస్తారో చూడాలి.

కాగా చాలామంది అభిమానుల్లో అయితే ఒక ఆసక్తి ఎక్కువుగా కనిపిస్తుంది. అదేంటంటే.. కల్కికి యుద్ధవిద్యల్లో ట్రైనింగ్ ఇచ్చేది ‘పరశురాముడు’. హిందూ పురాణాల్లో ఈ పాత్రకి ఓ రేంజ్ మాస్ ఇమేజ్ ఉంది. శివుడు దగ్గర యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్న పరశురాముడు కల్కి ట్రైనింగ్ ఇవ్వనున్నారంటే.. ఆ పాత్ర పోషించేది ఎవరని అందరిలో ఆసక్తి నెలకుంది. మరి ఆ పవర్ ఫుల్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.