Fahad Faasil : సినిమాలే లైఫ్ కాదు.. జీవితంలో చాలా ఉన్నాయి.. ఫ్యాన్ వార్స్ బ్యాచ్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఫహద్ ఫాజిల్..

ఫహద్ ఫాజిల్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలని మాట్లాడారు.

Fahad Faasil : సినిమాలే లైఫ్ కాదు.. జీవితంలో చాలా ఉన్నాయి.. ఫ్యాన్ వార్స్ బ్యాచ్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఫహద్ ఫాజిల్..

Fahad Faasil Sensational Comments on Movies and Fans

Fahad Faasil : మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం అన్ని పరిశ్రమలలోను దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమాతో ఇక్కడ తెలుగులో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది.

ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఫహద్ ఫాజిల్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలని మాట్లాడారు. మనం సినిమాని చూసి వదిలేయకుండా సినిమాల గురించి గంటలు గంటలు డిస్కషన్స్ పెడతాం. మనం ఏ పని చేసినా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఇక కొంతమంది ఫ్యాన్స్ అయితే మా హీరో గొప్ప, మా సినిమా గొప్ప, మా రికార్డులు.. అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల సినిమా లవర్స్ కి ఇబ్బందే. తాజాగా ఫహద్ ఫాజిల్ ఇలాంటి వాళ్లందరికీ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.

Also Read : AMB Cinemas : బెంగుళూరులో బాబు ల్యాండ్ అయినట్టే.. కన్నడ పరిశ్రమలోకి AMB సినిమాస్..

ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. సినిమా చూస్తున్నంతసేపు మమ్మల్ని పట్టించుకోండి, ఆ తర్వాత మా గురించి అస్సలు ఆలోచించకండి. సినిమానే జీవితం కాదు. జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. థియేటర్లో ఉన్నంతసేపు ఎంటర్టైన్ అవుతాం, మహా అయితే సినిమా అయ్యాక ఇంటికి వెళ్లే దారిలో ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం. అంతే కానీ ఎప్పుడు చూడు సినిమాల గురించి మాట్లాడటం ఎందుకు?. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మమ్మల్ని పట్టించుకోకండి. అలాంటివి నాకైతే ఇష్టం ఉండదు. సినిమాని కూడా ఓ హద్దులో ఉంచాలి. సినిమాలు చూడటమే మన లైఫ్ కాదు కదా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడుతూ ఫ్యాన్ వార్స్ చేసే వాళ్లకి, హీరోలని మోస్తూ బతికేవాళ్ళకి ఫహద్ ఫాజిల్ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.