AMB Cinemas : బెంగుళూరులో బాబు ల్యాండ్ అయినట్టే.. కన్నడ పరిశ్రమలోకి AMB సినిమాస్..
ఇప్పుడు బెంగుళూరులో కూడా AMB సినిమాస్ ని నిర్మిస్తున్నారు.

Mahesh Babu AMB Cinemas in Bengaluru Work Started with Pooja Ceremony
AMB Cinemas : మహేష్ బాబు(Mahesh Babu) ఓ పక్క సినిమాలు చేస్తూనే యాడ్స్, బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్ మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏషియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో AMB సినిమాస్ అని స్థాపించారు. ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు బెంగుళూరులో కూడా AMB సినిమాస్ ని నిర్మిస్తున్నారు.
బెంగళూరు గాంధీనగర్ లో ఉన్న కపాలి థియేటర్ కర్ణాటకలోనే అతిపెద్ద థియేటర్. దాదాపు 40 ఏళ్ళుగా ఈ థియేటర్ నడిచింది. ఆ తర్వాత నష్టాలు రావడంతో ఈ థియేటర్ 2017లో క్లోజ్ అయింది. ఈ థియేటర్ ప్లేస్ లో ఒక మాల్ కడుతుండటంతో ఇందులో మహేష్ బాబు తన AMB సినిమాస్ ని కడుతున్నారు.
Also Read : Vijay Deverakonda : ‘మ్యాజిక్’ సినిమా రిలీజ్ జులైలో.. మరి VD12 సంగతి ఏంటి..?
తాజాగా నిన్న దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం జరగగా ఏషియన్ సునీల్ తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ మల్టీప్లెక్స్ లో 6 స్క్రీన్స్ ఉంటాయని సమాచారం. హైదరాబాద్ లో సక్సెస్ అయిన AMB సినిమాస్ బెంగుళూరులో కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక అభిమానులు మహేష్ కి బెంగుళూరుని కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లో రూల్ చేయాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Namma Bengaluru….shall we begin? ?
The prestigious and luxurious @AMB_Cinemas is now expanding its footprint to Bangalore ❤️
The auspicious pooja muhurtam was held today ? and very soon the unparalleled entertainment will hit the CITY ⏳ pic.twitter.com/9K1QdQXbxF
— ??????????? (@UrsVamsiShekar) April 24, 2024