Site icon 10TV Telugu

Aadhi Pinisetty – Nikki Galrani : వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్.. పిక్స్ వైరల్..

Aadhi Pinisetty Nikki Galrani enjoying vacation at Thailand

Aadhi Pinisetty Nikki Galrani enjoying vacation at Thailand

Aadhi Pinisetty – Nikki Galrani : ఆన్ స్క్రీన్ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2022లో ఈ ఇద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇక ఆ తరువాత నిక్కీ గల్రాని సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆది పినిశెట్టి మాత్రం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే పెళ్లి అయ్యి రెండేళ్లు అవుతుండడంతో అభిమానులు వీరి నుంచి ఓ గుడ్ న్యూస్ ని ఆశిస్తున్నారు.

కానీ ఈ స్టార్ కపుల్ ఆ శుభవార్తని చెప్పకుండానే కాలం గడుపుతూ వస్తున్నారు. ఆ మధ్య నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అయ్యినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఎటువంటి నిజం లేదని నిక్కీ ఒక్క పోస్టుతో అందరికి క్లారిటీ ఇచ్చేసారు. కాగా ఈ స్టార్ కపుల్ రీసెంట్ గా ఓ హాలిడే వెకేషన్ ట్రిప్ కి వెళ్లారు. థాయిలాండ్ లో ప్రస్తుతం ఈ లవ్ కపుల్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Also read : Allu Arjun : బోయపాటి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన అల్లు అరవింద్.. అంటే బన్నీ సినిమా ఉన్నట్లేనా..!

అక్కడ ఏనుగుల రక్షణ క్యాంపులో ఆది అండ్ నిక్కీ ఎంజాయ్ చేస్తున్నారు. ఏనుగులతో టైం స్పెండ్ చేస్తూ జాలిగా ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్టుల్లో ఆది అండ్ నిక్కీని చూసిన నెటిజెన్స్.. లవ్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version