Pushpa 2 star Allu Arjun Boyapati Srinu movie is still on cards
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటనేది ఒక క్లారిటీ రావడం లేదు. అట్లీ, త్రివిక్రమ్, బోయపాటి అంటూ ముగ్గురు దర్శకులు పేరులు అల్లు అర్జున్ లైనప్ లో వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో మరో సినిమా ఉండబోతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
అయితే అది ఎప్పుడు అనేది మాత్రం తెలియజేయలేదు. ఇక బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా గురించి అసలు ఊసే లేకపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ లేనట్లే అని బన్నీ ఫ్యాన్స్ కూడా భావించారు. అయితే తాజాగా గీతా ఆర్ట్స్ చేసిన ఓ పోస్ట్.. ఈ సినిమా ఇంకా లైనప్ లోనే ఉందనే సంకేతం ఇస్తుంది. నేడు బోయపాటి శ్రీను పుట్టినరోజు కావడంతో.. అల్లు అరవింద్ ఆ బర్త్ డేని తన ఆఫీస్ లో సెలబ్రేట్ చేసారు.
Also read : NTR : ముంబై ఫోటోగ్రాఫర్స్ పై ఎన్టీఆర్ సీరియస్.. వీడియో వైరల్..
ఇక అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోల్లో బోయపాటి గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఉండడం గమనించిన ఫ్యాన్స్.. అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో మళ్ళీ ఆశలు చిగురించాయి. గతంలో బన్నీ అండ్ బోయపాటి కాంబినేషన్ లో ‘సరైనోడు’ సినిమా వచ్చి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
Ace Producer #AlluAravind garu and our @GeethaArts team celebrated the birthday of Massive Blockbuster Director #BoyapatiSrinu garu?✨
Here’s to many more years of success and good health❤️#HBDBoyapatiSrinu #HappyBirthdayBoyapatiSrinu pic.twitter.com/ciVVe9iPZx
— Geetha Arts (@GeethaArts) April 25, 2024
దీంతో ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకు వస్తారో చూడాలి. పుష్ప 2 విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. ఆగష్టులో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది.