NTR : ముంబై ఫోటోగ్రాఫర్స్ పై ఎన్టీఆర్ సీరియస్.. వీడియో వైరల్..

వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

NTR : ముంబై ఫోటోగ్రాఫర్స్ పై ఎన్టీఆర్ సీరియస్.. వీడియో వైరల్..

War 2 star NTR fires on mumbai photographers video viral

NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో దేవర షూటింగ్ ని, ముంబై వెళ్లి వార్ 2 షూటింగ్ ని చేస్తూ వస్తున్నారు. ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మూడు రోజుల క్రితం సెకండ్ షెడ్యూల్ కోసం మళ్ళీ ముంబై వెళ్లారు. ప్రస్తుతం అక్కడే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇక అక్కడే ముంబైలో ఉన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అవుతూ కనిపిస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ హోటల్ లోకి వెళ్తున్న ఎన్టీఆర్ ని ఫోటో తీసేందుకు కొందరు ఫోటోగ్రాఫర్స్ వెనకపడ్డారు. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తుండడంతో ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. ఓయ్ అంటూ వారి పై ఫైర్ అవుతూ అరిచారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Harom Hara : సుధీర్ బాబు ‘హరోంహర’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. కనులెందుకో..

అయితే ఎన్టీఆర్ ఇలా చేయడానికి కారణం.. మూవీలోని తన మాక్ ఓవర్ అండ్ లుక్ ని సీక్రెట్ గా ఉంచడం కోసమే అని సమాచారం. మూవీలోని తన మాక్ ఓవర్ ని రివీల్ చేయకూడదని ఎన్టీఆర్ చూస్తుంటే.. అక్కడి ఫోటోగ్రాఫర్స్ తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తూ వస్తున్నారు. దీనివల్లే ఎన్టీఆర్ సీరియస్ అవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు.