Site icon 10TV Telugu

Sreeleela : ఆ స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్.. అప్పుడేనా..?

Sreeleela special song in Vijay The Greatest of All Time movie

Sreeleela special song in Vijay The Greatest of All Time movie

Sreeleela : గత ఏడాది టాలీవుడ్ తెగ సందడి చేసిన శ్రీలీల.. ఒక్కసారిగా సైలెంట్ అయ్యపోయారు. ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘గుంటూరు కారం’ సినిమాతో సందడి చేసినప్పటికీ.. ఆ తరువాత మరో సినిమా అనౌన్స్ చేయకపోవడంతో శ్రీలీల మాట ఎక్కడ వినిపించడం లేదు. ప్రస్తుతం శ్రీలీల చేతులో ఉన్న ఒక్క సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఇప్పటిలో స్టార్ట్ అయ్యేది లేదు. దీంతో శ్రీలీల నెక్స్ట్ ఏంటి? అన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇటీవల అజిత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారని టాక్ వినిపించింది. కానీ దానిలో ఎంత నిజముందో తెలియదు. ఇప్పుడు మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీలీల సిద్దమవుతున్నారట. శ్రీలీల డాన్స్ టాలెంట్ గురించి ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈక్రమంలోనే విజయ్ నటిస్తున్న కొత్త సినిమాలో ఓ మాస్ ఐటెం బీట్ ని శ్రీలీలతో ప్లాన్ చేస్తున్నారట.

Also read : Family Star : ఓటీటీకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో విజయ్ తో పాటు శ్రీలీల ఓ ఐటెం నెంబర్ లో చిందేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ న్యూస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నప్పటికీ.. శ్రీలీల ఫ్యాన్స్ ని మాత్రం కొంచెం నిరాశ పరుస్తుంది. ఎందుకంటే, మన సౌత్ లో హీరోయిన్స్ లో చాలామంది.. తమకి ఆఫర్లు తగ్గినప్పుడు ఐటెం నెంబర్స్ కి ఓకే చెబుతుంటారు.

ఇక గత ఏడాదే స్టార్ హీరోయిన్ గా స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీలీల.. ఈ ఏడాది హీరోయిన్ గా ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయకపోవడం గమనార్హం. అదికాకుండా ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ న్యూస్ రావడం చూసి.. శ్రీలీల స్టార్‌డమ్ అప్పుడే తగ్గిపోయిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ ని కొంచెం నిరాశకి లోనవుతున్నారు.

 

Exit mobile version