Family Star : ఓటీటీకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

ఓటీటీకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

Family Star : ఓటీటీకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

Vijay Deverakonda Mrunal Thakur Family Star ott details

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతగోవిందం’ తరువాత దర్శకుడు పరుశురామ్ మరోసారి విజయ్ తో కలిసి ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మంచి అంచనాలతోనే థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రివ్యూలనే అందుకుంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో ఓటీటీలో సత్తా చాటేందుకు కొంచెం ముందుగానే వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ నేటి నుంచి ఆడియన్స్ కి అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. మరి థియేటర్ లో మిస్ అయిన వారు ఉంటే.. ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా గీతగోవిందంకి మ్యూజిక్ చేసిన గోపి సుందర్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించారు.

Also read : Aadhi Pinisetty – Nikki Galrani : వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్.. పిక్స్ వైరల్..

కథ విషయానికొస్తే.. అన్నయ్యలు ఇద్దరు కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో హీరో తన మిడిల్ క్లాస్ బాధ్యతని తీసుకుంటాడు. ఇలాంటి హీరో లైఫ్ లోకి హీరోయిన్ వస్తుంది. తాను ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం మీద థీసిస్ రాయడం కోసం హీరో లైఫ్ లోకి వస్తుంది. అది తెలియని హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తెలిసిన తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.