Kaavaali Video Song : జైలర్ నుంచి ‘కావాలి’ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఒక లుక్ వేసేయండి..

ర‌జినీకాంత్ జైలర్ మూవీలోని 'కావాలి' ఫుల్ వీడియో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్.

Kaavaali full Video Song is out from Rajinikanth Jailer

Kaavaali Video Song : సూపర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ (Jailer). ఇక ఈ సినిమాలోని ‘కావాలి’ సాంగ్.. రిలీజ్ కి ముందే మూవీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అనిరుద్ ఇచ్చిన క్యాచీ ట్యూన్ కి డాన్స్ మాస్టర్ జానీ కోరియోగ్రఫీ చేసిన గ్రేస్ స్టెప్పులు.. ఇక ఆ స్టెప్స్ ని తమన్నా (Tamannaah) వేసి ఏ ఒక్కర్ని తన నుంచి కళ్ళు తిప్పనివ్వకుండా చేసింది.

Timothée Chalamet : ప్రేమ రూమర్‌ని అఫీషియల్ చేసిన ‘డూన్’ హీరో.. పబ్లిక్‌గా ఘాటు ముద్దు..

సౌత్ టు నార్త్ ఈ పాట ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్స్ ని సెలబ్రిటీస్ సైతం రీ క్రియేట్ చేస్తూ రీల్స్ చేశారు. ఇక ఈ సాంగ్ ఫుల్ వీడియో కోసం అభిమానులు అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఆ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. సాంగ్ లో కేవలం తమన్నా డాన్స్ మాత్రం కాదు సునీల్ తో కామెడీని కూడా జనరేట్ చేశాడు జానీ మాస్టర్. మరి ఆ మోస్ట్ లవ్‌డ్ వీడియో సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీ వెండితెర పై కాదా..? బుల్లితెర మీదనా..!

ఇక ఈ మూవీ కూడా రేపటి (సెప్టెంబ‌ర్ 7) నుంచి ఓటీటీలో ప్రసారం కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) లో ఈ మూవీ అందుబాటులోకి రాబోతుంది. మరి థియేటర్ లో మిస్ అయిన వారు ఉంటే.. ఈ మూవీని ఓటీటీలో చూసేయండి. కాగా 240 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఇంతటి బ్లాక్ బస్టర్ అవ్వడంతో నిర్మాత కళానిధి మారన్.. రజినీకాంత్‌కి, దర్శకుడు నెల్సన్‌కి, అనిరుద్‌కి క్యాష్ చెక్ తో పాటు బ్రాండ్ కార్లను కూడా బహుమతిగా అందజేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు