kamal Haasan : మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా వచ్చి 36 ఏళ్లు అవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ కొత్త సినిమా కోసం వీళ్లిద్దరు జత కట్టారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కమల్ 234 వ సినిమా కావడం మరింత విశేషం.
Pushpa 2 : అల్లు అర్జున్‌కి పోటీగా కమల్ హాసన్, అజయ్ దేవగణ్.. పుష్ప 2 ఆ సినిమాలకు పోటీ ఇస్తుందా?
శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ అనే భారీ సినిమా చేస్తున్నారు. మరోవైపు తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ తన 234 వ సినిమాని అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారనేది అధికారిక ప్రకటన అయితే రాలేదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించబోతున్నారని మాత్రం వార్తలు వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
Kushi : మణిరత్నం ‘సఖి’ రిఫరెన్స్‌తోనే విజయ్ ‘ఖుషి’ తెరకెక్కిందా..? శివ నిర్వాణ కామెంట్స్..!
మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటించిన ‘నాయగన్’ 1987లో విడుదలైంది. ఈ సినిమాని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. మళ్లీ రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ సినిమాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాకపోయినా రీసెంట్గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో కమల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. నాయకుడు సినిమా టైంలో పనిచేసినట్లే పని చేస్తున్నామని .. తమ కాంబినేషన్లో వస్తున్న సినిమా గర్వపడేవిధంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కోసం తాను గడ్డం పెంచుతున్నానని కూడా కన్ఫర్మ్ చేసారు. ప్రస్తుతం కమల్ ఇచ్చిన అప్డేట్ వైరల్ అవుతోంది.