Lokesh Kanagaraj : LCUలో ఆ క్యారెక్టర్స్‌తో కూడా మూవీస్.. రజినీకాంత్ సినిమాలోని ఒక సీక్వెన్స్ కోసం..

‘లియో’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న లోకేష్ కనగరాజ్.. తన సినిమాటిక్ యూనివర్స్ గురించి, తన తదుపరి ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఈక్రమంలోనే..

Lokesh Kanagaraj comments about LCU and Thalaivar 171

Lokesh Kanagaraj : కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. విజయ్ తో తెరకెక్కించిన ‘లియో’ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తన సినిమాటిక్ యూనివర్స్ గురించి, తన తదుపరి ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. లోకేష్ నెక్స్ట్ లైనప్ ఏంటంటే.. రజినీకాంత్‌తో Thalaivar 171, కార్తితో ఖైదీ-2, కమల్‌తో విక్రమ్-2, సూర్యతో రోలెక్స్, ప్రభాస్‌తో ఒక మూవీ. కాగా రజిని సినిమాని ఎప్పుడు పట్టాలు ఎక్కించబోతున్నాడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also read : Lokesh Kanagaraj : ప్రభాస్ సినిమాతో లోకేష్ కనగరాజ్ ఎండ్ గేమ్.. ఐరన్ మ్యాన్‌లా..

తాజాగా దీని గురించి అప్డేట్ ని లోకేష్ ఇచ్చాడు. Thalaivar 171ని వచ్చే ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నాడట. లియో రిలీజ్ అయిన తరువాత నుంచి ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని తెలియజేశాడు. ఈ సినిమా కథని తన మొదటి మూవీ ‘నగరం’ కంటే ముందే రాసుకున్నాడట. ఇక ఈ సినిమాలోని ఒక సీక్వెన్స్ కోసం IMAX కెమెరాని ఉపయోగించబోతున్నట్లు వెల్లడించాడు. జనరల్ గా రెగ్యులర్ కెమెరాతో ముందుగా షూట్ చేసి ఆ తరువాత ఐమ్యాక్స్ ఫార్మాట్ లోకి కన్వెర్ట్ చేస్తారు.

Also read : Jagapathi Babu : అభిమానులకు జగ్గూభాయ్ సీరియస్ నోట్.. ఇక సెలవు..

ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుతూ.. “ఈ యూనివర్స్ ఒక రేంజ్ కి వచ్చిన తరువాత ఇతర డైరెక్టర్స్ కూడా LCU లో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఈ యూనివర్స్ లో కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయిన ఏజెంట్ టీనా, నెపోలియన్ వంటి పాత్రలతో ఇతర డైరెక్టర్స్ సినిమాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలియజేశాడు. ఏజెంట్ టీనా క్యారెక్టర్ కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీలోని పాత్ర, నెపోలియన్ క్యారెక్టర్ కార్తీ ‘ఖైదీ’ సినిమాలోని కానిస్టేబుల్ పాత్ర. ఈ రెండు రోల్స్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు