Pawan Kalyan: నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమించే నా తమ్ముడు.. పవర్‌స్టార్‌కి మెగాస్టార్ విషెస్

మెగాస్టార్ తమ్ముడిగా తెలుగుతెరకి పరిచయమై బద్రి, తమ్ముడు, ఖుషి వంటి యూత్ ఫుల్ మూవీస్ తీసి తనకంటూ యూత్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు (సెప్టెంబర్2) పవన్ పుట్టినరోజు కావడంతో సినీ మరియు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. ఆ క్రమంలోనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ కి విషెస్ చెప్పారు.

Pawan Kalyan: మెగాస్టార్ తమ్ముడిగా తెలుగుతెరకి పరిచయమై బద్రి, తమ్ముడు, ఖుషి వంటి యూత్ ఫుల్ మూవీస్ తీసి తనకంటూ యూత్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 9ఏళ్ళ పాటు హిట్ లేకపోయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా కోట్లాదిమంది అభిమానం పొందగలిగాడు అంటే కేవలం సినిమాలో ఆయన చేసిన పాత్రలు చూసి మాత్రమే కాదు అంతకుమించిన అతని వ్యక్తిత్వం చూసి.

HBD Pawan Kalyan: నిప్పు కణం కళ్యాణ్.. తమ్ముడికి చిరు శుభాకాంక్షలు!

ఆ మనస్తత్వంతోనే ప్రజలకు సాయం చేయాలంటూ రాజకీయాలోకి అడుగుపెట్టారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. నేడు (సెప్టెంబర్2) పవన్ పుట్టినరోజు కావడంతో సినీ మరియు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. ఆ క్రమంలోనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ కి విషెస్ చెప్పారు.

Pawan Kalyan Fans: పవన్ బర్త్‌డే స్పెషల్ షోస్.. థియేటర్లను ధ్వంసం చేసిన అభిమానులు

చిరంజీవి తన ట్వీట్ లో పవన్ గురించి మాట్లాడుతూ..”తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను” అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు