Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా నుంచి.. పవర్ ప్యాక్డ్ పవర్ గ్లాన్స్.. పాన్ ఇండియా దద్దరిల్లాల్సిందే..

తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ అభిమానులకు హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ సర్‌ప్రయిజ్ ఇచ్చింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ చిన్న టీజర్ ని వదిలారు. ఈ టీజర్ లో................

Pawan Kalyan :  పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే యూత్ అందరికి ఎనర్జీ వస్తుంది. జస్ట్ తను అలా నడుచుకుంటూ వస్తే చాలు కోట్లల్లో కలెక్షన్స్ వస్తాయి. భారీ భారీ డైలాగ్స్ చెప్పక్కర్లేదు, కష్టపడి డ్యాన్సులు చేయక్కర్లేదు, VFX లు వాడక్కర్లేదు, పవన్ కళ్యాణ్ అలా తెరపై కనిపిస్తే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే, థియేటర్లు దద్దరిల్లాల్సిందే. గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలు స్లోగా చేస్తున్నారు. ఇప్పటికే పవన్ చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి.

కానీ పవన్ రాజకీయాల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమాలు రోజు రోజుకి వాయిదా పడుతున్నాయి. ఇప్పటివరకు మూడు సినిమాలు షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు. క్రిష్ దర్శకత్వంలో రానున్న హరిహర వీరమల్లు సినిమా 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగిలిన షూటింగ్ చేద్దామంటే రాజకీయాల బిజీ వల్ల పవన్ డేట్స్ ఇవ్వట్లేదు. దీంతో ఈ సినిమా కూడా ఆలస్యం అవుతుంది. దీనిపై పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan Fans: పవన్ బర్త్‌డే స్పెషల్ షోస్.. థియేటర్లను ధ్వంసం చేసిన అభిమానులు

తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ అభిమానులకు హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ సర్‌ప్రయిజ్ ఇచ్చింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ చిన్న టీజర్ ని వదిలారు. ఈ టీజర్ లో.. ”పవన్ కుస్తీ వీరులతో మట్టిలో పోటీ పడుతున్నట్టు చూపించారు. మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు అంటూ పవన్ చేత తొడ కొట్టించారు. చివర్లో పవన్ కళ్యాణ్ అలా సీరియస్ గా నడిచొస్తున్నట్టు” చూపించారు. దీంతో ఈ పవర్ గ్లాన్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కూడా పవన్ త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు