Nithiin: ‘సైతాన్’గా మారుతున్న నితిన్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో నితిన్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా హిట్ అయ్యేలా చేయాలని నితిన్ తెగ కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న నితిన్, ఉగాది పర్వదినాన తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ‘భీష్మ’ మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

Nithiin: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్ కుదిరిందిగా.. ఉగాది కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్..?

ఇక స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నితిన్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా, ఈ సినిమాకు వక్కంతం తనదైన మార్క్ పవర్‌ఫుల్ కథను అందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

Nithiin: అప్పుడు విక్రమ్.. ఇప్పుడు కబ్జా.. నితిన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ఈ టైటిల్‌ను నిజంగానే ఫిక్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నితిన్ పుట్టినరోజు కానుకగా మార్చి 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ట్రెండింగ్ వార్తలు