Mansion 24 Trailer : భయపెట్టడానికి వస్తున్న వరలక్ష్మి.. మ్యాన్షన్ 24 గది రహస్యం ఏంటి..?

'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఓంకార్ ఇప్పుడు 'మాన్షన్ 24' అనే వెబ్ సిరీస్‌తో..

Ohmkar Varalaxmi Sarathkumar Avika Gor Mansion 24 Trailer

Mansion 24 Trailer : టాలీవుడ్ యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్.. ‘రాజు గారి గది’ సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈ మూవీ సిరీస్ నుంచి ఇప్పటికి మూడు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి హారర్ కామెడీతో అలరించి సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ‘మాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సిరీస్ కూడా హారర్ కామెడీతో రూపొందుతుంది.

Also Read : Prithiveeraj : తన కొడుకు కంటే చిన్న అమ్మాయితో పృథ్వి రాజ్ లవ్ స్టోరీ.. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళలేదంటే?

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్య రాజ్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని హైదరాబాద్ లో ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ట్రైలర్ లో చూపించిన దాన్నిబట్టి.. సత్య రాజ్ ఒక పాడుబట్టు మ్యాన్షన్ లోకి వెళ్లి కనిపించకుండా పోతాడు. అతని వెతుకుంటూ ఆయన కూతురు అయిన వరలక్ష్మి.. ఆ మ్యాన్షన్ లోకి వెళ్తుంది. అక్కడ ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

Also Read : Naga Vamsi : ‘అజ్ఞాతవాసి’ సినిమా లాస్ నుంచి ‘అరవింద సమేత’ వల్ల కోలుకున్నాం.. ఎన్టీఆర్ పిలిచి హిట్ ఇచ్చారు..

అయితే ఈ ట్రైలర్ లో మ్యాన్షన్ హౌస్ లోని 24 గదిని ప్రత్యేకంగా చూపించారు. దీంతో ఆ రూమ్ లోనే ఏదో సస్పెన్స్ ఉందని ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా పాల్గొన్నాడు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా వస్తున్న ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమ్ కానుంది. రాజా గారి గది చిత్రాలతో ఆకట్టుకున్న ఓంకార్.. ఈ వెబ్ సిరీస్ తో కూడా బయపెడతాడా? లేదా? చూడాలి.

ట్రెండింగ్ వార్తలు