Pragathi : చీరలో ప్రగతి జిమ్ వీడియో చూశారా? 90 కిలోలు ఈజీగా మోసేస్తూ..

ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. రెగ్యులర్ గా తాను జిమ్(Gym) లో కష్టపడుతున్న వీడియోల్ని పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

Pragathi Shared a Gym Video in Saree Video Goes Viral

Pragathi : సహాయనటిగా ప్రగతి దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా మెప్పిస్తుంది ప్రేక్షకులను. 48 ఏళ్ళు వచ్చినా ఇంకా ఫుల్ ఆరోగ్యంగా, బాడీని కూడా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రగతి. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

అయితే ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. రెగ్యులర్ గా తాను జిమ్(Gym) లో కష్టపడుతున్న వీడియోల్ని పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ ఏజ్ లో కూడా జిమ్ లో అంత కష్టపడుతున్నారంటే గ్రేట్ అని పలువురు కామెంట్స్ చేస్తూ ప్రగతిని అభినందిస్తారు. రెగ్యులర్ గా జిమ్ డ్రెస్ లో వీడియోలు పోస్ట్ చేస్తుండగా తాజాగా చీరలో జిమ్ వీడియో పోస్ట్ చేయడం విశేషం. ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేసింది.

Also Read : Varun Lavanya Wedding Celebrations : వరుణ్ లావణ్య పెళ్లి వేడుకలు.. హల్దీ, మెహందీ, సంగీత్ ఫొటోలు

దీంతో ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 90 కేజీల బరువు మోయడం, అది కూడా చీరలో ఇలా మోయడం నిజంగా గ్రేట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రగతి రెండో పెళ్లి గురించి రూమర్స్ రాగా వాటిని సీరియస్ గా ఖండించింది.

 

ట్రెండింగ్ వార్తలు