Detective Teekshana : ఉపేంద్ర భార్య 50వ సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రేజ్ ఆఫ్ తీక్షణ..

భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో డిటెక్టివ్ తీక్షణ తెరకెక్కుతుంది.

Priyanka Upendra 50th Film Detective Teekshana first Song Rage of Teekshana Released

Detective Teekshana : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర భార్య, యాక్షన్ క్వీన్ డా. ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం గా ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు SDC సినీ క్రియేషన్స్ బ్యానర్ లపై ఖర్చుకి ఈ సినిమాని నిర్మించారు.

భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో డిటెక్టివ్ తీక్షణ తెరకెక్కుతుంది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్ తో మెప్పించారు. ట్రైలర్ చిత్రం మీద అంచనాలను మరింతగా పెంచింది. నేడు ఈ సినిమా నుండి ఫస్ట్ పాట.. రేజ్ ఆఫ్ తీక్షణను విడుదల చేశారు.

“రణరణమున రధము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి.. కుత్తుకల కోట కూల్చే తీక్షణా..
కణకణమున యుద్ధ నీతి, కనికరమే లేని యువతి
క్రూర కథల కత్తివేటు తీక్షణా..” అంటూ సాగే ఈ ఎనర్జిటిక్ సాంగ్ లో తీక్షణ తను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే తీరుని రేజ్ ఆఫ్ తీక్షణ పాట రూపంలో వివరించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతం పెద్దపల్లి రోహిత్ అందించగా, హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య ఆలపించారు. శక్తి గ్రఫిస్టే క్రియేట్ చేసిన లిరికల్ వీడియో కూడా ఆకట్టుకునే యానిమేషన్ తో, ఆసక్తికరమైన మేకింగ్ వీడియోతో రూపొందించారు.

Also Read : Bigg Boss 7 Day 54 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మిర్చి దండలతో కెప్టెన్ ఎన్నిక..

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘డిటెక్టివ్ తీక్షణ’ ను కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒరియా, వంటి ఏడు భాషల్లో త్వరలోనే విడుదల చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు