Ravanasura: పండగ రోజున చిందులేయించనున్న రావణాసుర

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. రవితేజ లాస్ట్ మూవీ ధమాకా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మూవీగా నిలవడంతో, ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ అంచనాలు బాగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ravanasura: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. రవితేజ లాస్ట్ మూవీ ధమాకా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మూవీగా నిలవడంతో, ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ అంచనాలు బాగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ravanasura: మాస్ రాజా సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నాయట!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్, టీజర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా ఉగాది కానుకగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా నుండి మరో సింగిల్ సాంగ్ ‘డిక్క డిష్యుం’ను మార్చి 22న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

Ravanasura : సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి.. రావణాసుర టీజర్ రిలీజ్.. రవితేజ నెగిటివ్ రోల్?

ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నాడలు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు