Tiger Nageshwara Rao : ఎక్ ధమ్ నచ్చేసావే అంటూ ప్రేమ పాఠాలు చెబుతున్న గ‌జ‌దొంగ‌

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (Tiger Nageshwara Rao). ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను విడుద‌ల చేసేందుకు సిద్దం అయ్యారు.

Tiger Nageswara Rao First single

Tiger Nageshwara Rao First single : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (Tiger Nageshwara Rao). నూత‌న ద‌ర్శ‌కుడు వంశీ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో క‌నిపించ‌నున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tillu Square : సెప్టెంబర్ నుంచి మరో సినిమా అవుట్.. టిల్లు స్క్వేర్ రిలీజ్ పోస్ట్‌పోన్..

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను విడుద‌ల చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. ఎక్ ధమ్.. ఎక్ ధమ్ అంటూ పాట సాగుతోంది. పూర్తి పాట‌ను మంగ‌ళ‌వారం సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. భాస్క‌ర భ‌ట్ల ఈ పాట‌కు లిరిక్స్ రాయ‌గా జీవి ప్ర‌కాశ్ సంగీతాన్ని అందించారు.

Rules Ranjan : రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ప్ర‌భాస్‌తో పోటీనా..?

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1970’s లో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రవితేజ ఎప్పుడూ కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు