RGV : ఆర్జీవీ వ్యూహం, శపథం.. రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ.. ఎప్పుడో తెలుసా?

వైఎస్ జగన్ కి సంబంధించిన కథతో రెండు పార్టులుగా రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవీ. మొదటి పార్ట్ వ్యూహం అనే టైటిల్ తో, రెండో పార్ట్ శపథం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు ఆర్జీవీ.

RGV Movies Vyooham and Shapadham Movies Ready to Release

RGV Movies : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) ఒకప్పుడు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో సూపర్ హిట్ సినిమాలు అందించి గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆర్జీవీ గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం, శపథం అనే పొలిటికల్ సినిమాలతో రాబోతున్నాడు.

వైఎస్ జగన్ కి సంబంధించిన కథతో రెండు పార్టులుగా రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవీ. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి.

Also Read : Raviteja : శిల్పాశెట్టితో కలిసి చిందేసిన రవితేజ.. బాలీవుడ్ లో మాస్ మహారాజ హంగామా..

మొదటి పార్ట్ వ్యూహం అనే టైటిల్ తో, రెండో పార్ట్ శపథం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు ఆర్జీవీ. ఆల్రెడీ వ్యూహం సినిమా టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. తాజాగా వ్యూహం, శపథం రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు ఆర్జీవీ. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఆర్జీవీ. ఇక ఈ సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలు కూడా గతంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లాగే ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తాయేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు