Operation Raavan : ‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ.. సైకో కిల్లర్ ని చివరిదాకా కనిపెట్టలేరు..

ఇలాంటి సినిమాల్లో కిల్లర్ ఎవరు అనేది చాలా మంది గెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఆ కిల్లర్ ఎవరు అనేది క్లైమాక్స్ లో రివీల్ చేసేంతవరకు కూడా ఎవరు కనిపెట్టలేరు.

Rakshit Atluri Operation Raavan Movie Review and Rating

Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన హీరో రక్షిత్ అట్లూరి తాజాగా ఆపరేషన్ రావణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆపరేషన్ రావణ్ సినిమా నేడు జులై 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. రామ్(రక్షిత్ అట్లూరి) ఓ ఛానల్ చైర్మన్ కొడుకు అయినా ఆ ఛానల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోడానికి అందులో ఎంప్లాయిగా జాయిన్ అవుతాడు. అదే ఛానల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆమని(సంగీర్తన)ని చదువుకునే సమయం నుంచే లవ్ చేస్తాడు. ఆమనికి ఇష్టం ఉన్నా రామ్ ప్రేమకు ఓకే చెప్పదు. ఆమని ఓ మంత్రి(రఘు) అవినీతి స్టింగ్ ఆపరేషన్ చేసి కనుక్కొని టెలికాస్ట్ చేద్దామంటే ఛానల్ లో పై అధికారులు అది పక్కన పెట్టి ఓ సీరియల్ కిల్లింగ్ కేసు ఇస్తాడు.

ఓ సీరియల్ కిల్లర్ వరుసగా పలువురు అమ్మాయిలని కిడ్నాప్ చేసి చంపుతూ ఉంటాడు. సుజాత(రాధికా శరత్ కుమార్) ఆమె కూతురు కనిపించట్లేదని పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రామ్, ఆమని పెళ్లి సమయానికి ఆమని కూడా సీరియల్ కిల్లర్ చేతిలో కిడ్నాప్ అవుతుంది. దీంతో రామ్ ఆమనిని కాపాడుకుంటాడా? సుజాత కూతురు ఏమైంది? ఈ కేసులో పోలీసులు ఏం చేసారు? మంత్రి ఆమనిని ఏం చేసాడు? అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Raayan Review : ‘రాయన్’ మూవీ రివ్యూ.. ధనుష్ 50వ సినిమా ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ.. ఇటీవల సీరియల్ కిల్లర్స్ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఎక్కువగానే వస్తున్నాయి. ఈ ఆపరేషన్ రావణ్ కూడా అలాంటి కథే. ఓ వ్యక్తి సీరియల్ కిల్లర్ గా, సైకోగా ఎందుకు మారతాడు? ఎలా మారతాడు అనే పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ జాబ్, లవ్.. ఇలా కమర్షియల్ కథతో మొదలుపెట్టి ఆ తర్వాత సైకో కిల్లర్ కథలోకి తీసుకెళ్తాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ఆమనిని కిడ్నాప్ చేయడంతో అక్కడ్నుంచి ఆసక్తిగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో ఆ కిల్లర్ ఎవరు అనే చివరి వరకు సాగుతుంది.

ఇక క్లైమాక్స్ లో కిల్లర్ ఇతనా అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటి సినిమాల్లో కిల్లర్ ఎవరు అనేది చాలా మంది గెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఆ కిల్లర్ ఎవరు అనేది క్లైమాక్స్ లో రివీల్ చేసేంతవరకు కూడా ఎవరు కనిపెట్టలేరు. అది ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఈ విషయంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. ఆ ధైర్యంతోనే కిల్లర్ ఎవరో ఇంటర్వెల్ లోపు కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తామని సినిమా రిలీజ్ కి ముందు కాంటెస్ట్ కూడా ప్రకటించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రక్షిత్ అట్లూరి జర్నలిస్ట్ పాత్రలో, యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. హీరోయిన్ సంగీర్తన సిన్సియర్ జర్నలిస్ట్ గా మెప్పించి, కిడ్నాప్ అయ్యాక సీన్స్ లో చాలా బాగా నటించింది. రాధికా శరత్ కుమార్ ఎమోషనల్ గా ప్రేక్షకులని మెప్పిస్తుంది. కిల్లర్ పాత్రలో నటించిన నటుడు కూడా సైకో పాత్రలో పర్ఫెక్ట్ గా నటించాడు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Committee Kurrollu Trailer : నిహారిక నిర్మాతగా.. ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైల‌ర్ వచ్చేసింది..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా సైకో సీన్స్ లో మాత్రం అదరగొట్టారు. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. కథ పాతదే అయినా కిల్లర్ ఎవరో చివరివరకు కనిపెట్టలేకుండా కథనం బాగా రాసుకున్నారు. డైరెక్టర్ గా వెంకట సత్య మొదటి సినిమాతో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ఆపరేషన్ రావణ్’ సినిమా ఓ సైకో కిల్లర్ ఎందుకు అమ్మాయిలని చంపుతున్నాడు, ఎందుకు అతను సైకోలా మారాడు అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు