Game Changer : గేమ్ చెంజర్‌ని హ్యాండిల్ చేయలేనని.. స్టోరీ వదులుకున్న స్టార్ డైరెక్టర్.. ఎవరు అతను..?

గేమ్ చెంజర్‌ని హ్యాండిల్ చేయలేనని అనుకోని ఆ స్టోరీ వదులుకున్నాను అంటూ ఆ స్టార్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఎవరు అతను..?

S Shankar Ram Charan Game Changer story news gone viral

Game Changer : రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లో ఈ మూవీలోని ఎమోషనల్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నట్లు శంకర్ స్వయంగా తెలియజేశాడు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గేమ్ చెంజర్‌ని హ్యాండిల్ చేయలేనని అనుకోని ఆ స్టోరీ వదులుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..?

ఈ మూవీకి మరో తమిళ డైరెక్టర్ ‘కార్తీక్ సుబ్బరాజ్’ స్టోరీని అందిస్తున్నాడు. తను రాసుకున్న కథ శంకర్ కి నచ్చడం ఇచ్చేశాడు. ఆ స్టోరీ రాసుకున్న తరువాత కార్తీక్ సుబ్బరాజ్‌.. ఇది నా జోనర్ కథ కాదు. శంకర్ సార్ జోనర్ కథని ఫీల్ అయ్యాడట. ఆ కథని తను హ్యాండిల్ చేయలేనని అనుకున్నాడట. దీంతో ఆ కథని శంకర్ కి ఇచ్చేసినట్లు చెప్పుకొచ్చాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజ్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Anasuya Bharadwaj : ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఫ్లోలో ఏజ్ చెప్పేసిన అనసూయ.. వీడియో వైరల్

కాగా ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య.. మరికొంతమంది స్టార్ నటులు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి ఒక సాంగ్ లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. దసరాకి ఈ మూవీ నుంచి మ్యూజిక్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం చరణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు