Sir Movie : సార్ సినిమాని స్కూల్ పిల్లలకు ఫ్రీగా చూపిస్తాం.. స్పెషల్ ఆఫర్ ఇచ్చిన సార్ చిత్రయూనిట్..

సార్ సినిమాలో ముఖ్యంగా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడంతో పాటు ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఈ సినిమాలో చెప్పడంతో.................

Sir Movie :  ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజయి భారీ విజయం సాధించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రప్పించింది సార్ సినిమా. ఇప్పటికే సార్ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 100 కోట్లకు దూసుకుపోతుంది.

సార్ సినిమాలో ముఖ్యంగా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడంతో పాటు ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఈ సినిమాలో చెప్పడంతో స్టూడెంట్స్, టీచర్స్ ని ఈ సినిమా చూడాలని చిత్రయూనిట్ కోరుతున్నారు. అంతేకాక మంచి సినిమా అందరికి చేరాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఇటీవల PVR సంస్థతో కలిసి హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు సార్ సినిమాని PVR థియేటర్స్ లో ఫ్రీగా చూపించారు. ఒక మంచి సినిమా, చదువు విలువ అందరికి తెలిసేలా చేయడానికే ఫ్రీగా స్కూల్ పిల్లలకు సినిమా చూపిస్తున్నామని తెలిపారు చిత్రయూనిట్.

Romancham : మరోసారి హాట్ టాపిక్ గా మలయాళ సినిమా.. 2 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా..

తాజాగా సార్ చిత్రయూనిట్ మరో ఆఫర్ తో ముందుకొచ్చింది. చిత్ర నిర్మాత నాగవంశీ తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. సార్ మూవీ ప్రధాన లక్ష్యం విద్య విలువ గురించి అవగాహన కల్పించడం. ఇటీవల కొంతమంది స్కూల్‌ పిల్లలకు మా సినిమాను ఉచితంగా చూపించడం ఆనందంగా ఉంది. మరింతమంది స్కూల్ పిల్లలకు ఈ సినిమాని ఫ్రీగా చుపించాలనుకుంటున్నాం. స్కూల్స్ ఈ విషయంలో మమ్మల్ని contact@sitharaents.com ద్వారా సంప్రదించండి. మా బృందం వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదించి మీ స్కూల్ పిల్లలకు సార్ సినిమాని ఉచితంగా చూపించే ఏర్పాట్లు చేస్తారు అని తెలిపారు. దీంతో అంతా సార్ సినిమా చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు