Bigg Boss 7 : ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్స్.. మరో ప్రేమ కహాని షురూ..

గురువారం జరిగిన బిగ్‌బాస్ ఎపిసోడ్ లో కొత్త ప్రేమ కహాని మొదలయింది. ఎవరిదో తెలుసా..? అలాగే నిన్నటి ఎపిసోడ్స్ లో అందరూ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు..?

Telugu Bigg Boss 7 day 32 episode highlights

Bigg Boss 7 : గురువారం జరిగిన బిగ్‌బాస్ సీజన్ 7 ఎపిసోడ్ ఫన్ అండ్ ఎమోషనల్ గా సాగింది. అలాగే మరో ప్రేమ కహాని కూడా షురూ అయ్యింది. ఇంతకీ ఆ ప్రేమ కహాని ఎవరు మధ్య..? అలాగే నిన్నటి ఎపిసోడ్స్ లో అందరూ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు..?

యావర్ కి తెలుగు పెద్దగా రాదు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే హౌస్ లో ఈమధ్య ఎక్కువుగా హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ విషయంలోనే బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. యావర్ కి తెలుగు పాఠాలు నేర్పాలి అంటూ హౌస్ మేట్స్ కి ఒక డ్యూటీ అప్పగించాడు. ఇంటి సభ్యులంతా యావర్ కి ఐదేసి తెలుగు పదాలు నేర్పించాలంటూ పేర్కొన్నాడు. అయితే ఇక్కడే ఒక లింక్ పెట్టాడు. హౌస్ లో యావర్ అండ్ తేజ పెయిర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Also read : 800 Movie : ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ మూవీ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన బయోపిక్..

తేజని ఈ టాస్క్ లో ఇరికిస్తూ.. యావర్ ఒకవేళ ఇంటిలో తెలుగు కాకుండా ఇంకా వేరే భాషలో మాట్లాడితే తేజని శిక్షించవచ్చు అంటూ, అతని చేత గుంజీళ్లు పెట్టించవచ్చు అంటూ లింక్ పెట్టాడు. ఇక యావర్ కి హౌస్ మేట్స్ అంతా తెలుగు పాఠాలు నేర్పే బాధ్యత తీసుకుంటే.. శుభశ్రీ మాత్రం ప్రేమ పాఠాలు నేర్పే బాధ్యత తీసుకుంది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని తెలుగులో చెప్పమని ఆ పదం నేర్పించింది. అంతేకాదు యావర్ కి తన కొంగుని ఇచ్చి చిలిపిగా ప్రవర్తించడం ఇంటిలోని అందర్నీ షాక్ కి గురి చేసింది.

ఇక బిగ్ బాస్ మరో టాస్క్ ని నిర్వహించగా.. దానిలో అందరు ఎమోషనల్ అయ్యారు. హౌస్ మేట్స్ కి తమ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. అయితే అవి పొందాలంటే.. పెయిర్ గా ఉన్నవారిలో ఒకరు లెటర్ ని త్యాగం చేయాలనీ చెప్పాడు. అంతేకాదు ఆ లెటర్ త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోరులో కంటెండర్స్‌గా పోటీ చేసే ఛాన్స్ కూడా కోల్పోతారని చెప్పుకొచ్చాడు. ఆ లెటర్ ఎవరు త్యాగం చేస్తారు అనేది పెయిర్ లో ఉన్న ఇద్దరే డిసైడ్ చేసుకోవాలని చెప్పడంతో ఎమోషనల్ గా మారింది. గౌతమ్ కోసం శుభశ్రీ, తేజ కోసం యావర్ లెటర్స్ ని త్యాగం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు