Vijay Antony : రెహమాన్ కాన్సర్ట్ వివాదంలోకి విజయ్ ఆంటోనీ.. పరువు నష్టం దావా వేస్తాను అంటూ..

రెహమాన్ కాన్సర్ట్ వివాదం గత కొన్ని రోజులుగా తమిళనాడుని ఊపేస్తోంది. రెహమాన్ కాన్సర్ట్ వివాదంలోకి తాజాగా హీరో విజయ్ ఆంటోనీ వచ్చారు.

Vijay Antony fires on who spreading negative news on him regarding Rahaman Concert issue

Vijay Antony :  ఇటీవల చెన్నైలో(Chennai) జరిగిన రెహమాన్ కాన్సర్ట్(Rahaman Concert) వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ రెండు ప్రైవేట్ ఈవెంట్స్ సంస్థలు కలిసి రెహమాన్ తో మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ ప్లాన్ చేశాయి. 5000, 10 వేలకు, 20 వేలకు కూడా టికెట్స్ అమ్మారు. అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని, చాలా బాధలు పడ్డట్టు, పార్కింగ్ 2 కిలోమీటర్ల దూరంలో ఇచ్చినట్టు, ఈవెంట్ లో తొక్కిసలాట జరిగినట్టు, కొంతమందికి గాయాలు అయ్యాయని, అలాగే టికెట్స్ కొనుక్కున్నా కూడా లోపలి పంపించలేదని, ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా చెత్తగా కండక్ట్ చేసిందని రెహమాన్ అభిమానులు, ప్రేక్షకులు ఫైర్ అయ్యారు.

దీంతో రెహమాన్ కాన్సర్ట్ వివాదం గత కొన్ని రోజులుగా తమిళనాడుని ఊపేస్తోంది. ఈ విషయంలో ఈవెంట్ సంస్థలతో పాటు కొంతమంది రెహమాన్ ని కూడా విమర్శిస్తుండగా మరికొంతమంది మాత్రం ఈవెంట్ సంస్థలదే తప్పు అని రెహమాన్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ వివాదం పాలిటిక్స్ లోకి కూడా వెళ్లడంతో ఉదయనిధి స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టి ఈవెంట్ అలా జరగడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే ఈ రెహమాన్ కాన్సర్ట్ వివాదంలోకి తాజాగా హీరో విజయ్ ఆంటోనీ వచ్చారు. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో మంచి విజయం అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తమిళనాడులోని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రెహమాన్ కాన్సర్ట్ వెనక విజయ్ ఆంటోనీ ఉన్నాడని, ఆ ఈవెంట్ అలా జరగడానికి, వివాదంగా మారడానికి విజయ్ ఆంటోనీనే కారణం అని వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వీడియోలు విజయ్ ఆంటోనీ వరకు వెళ్లడంతో తాజగా విజయ్ దీనిపై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశారు.

Bigg Boss Kannada : బిగ్‌బాస్ ఫ్రీగా చూసేయొచ్చు.. ఎందులోనో తెలుసా?

ఈ లెటర్ లో విజయ్ ఆంటోనీ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రెహమాన్ కాన్సర్ట్ వివాదాన్ని నేను కావాలని సృష్టించినట్టు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఛానల్స్ పై పరువు నష్టం దావా కేసు వేస్తాను. ఆ కేసులో వచ్చిన డబ్బులతో పేద మ్యూజిక్ కుటుంబాలకు సహాయం చేస్తాను అని తెలిపారు. దీంతో విజయ్ ఆంటోనీ లెటర్ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు