Leo Movie Review : లియో మూవీ రివ్యూ.. కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే హీరో..

లోకేష్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోయిన వాళ్లకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కథ పరంగా అయితే ఇది సాధారణ కథే. మన తెలుగులోనే ఇలాంటి కథలు చాలా వచ్చాయి.

Leo Movie Review

Leo Movie Review :  ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి తన సినిమాలపై ఆసక్తిని పెంచారు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా తెరకెక్కిన లియో సినిమా దసరా కానుకగా నేడు అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా పై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

కథ విషయానికి వస్తే.. పార్తీబన్ (విజయ్) తన భార్య(త్రిష), పిల్లలతో హిమాచల్ ప్రదేశ్ లో ఓ బేకరీ నడుపుకుంటూ ఉంటాడు. ఒక రాత్రి సమయంలో అతని బేకరీలో డబ్బుల కోసం కొంతమంది దాడి చేయగా పార్తీబన్, అతని కూతుర్ని కాపాడుకోవడానికి అందర్నీ చంపేస్తాడు. దీంతో ఇతని ఫొటో, ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త సౌత్ లో పొగాకు వ్యాపారం చేసే యాంటోని దాస్(సంజిత్ దత్), హెరాల్డ్ దాస్(అర్జున్) వద్దకు వెళ్లగా వాళ్ళు ఇతను చనిపోయిన తమ కొడుకు లియో దాస్ అవునా కదా అని హిమాచల్ ప్రదేశ్ కి వెళ్తారు. పార్తీబన్ బేకరీలో చంపిన మనుషుల తాలూకు వాళ్ళు అతనిపై అటాక్ చేస్తారు. అక్కడ్నుంచి ఎవరో ఒకరు పార్తీబన్ ఫ్యామిలీపై అటాక్ చేస్తుంటారు. చివర్లో యాంటోని దాస్ పార్తీబన్ కొడుకుని ఎత్తుకెళ్తాడు. పార్తీబన్ కొడుకు ఏమయ్యాడు? ఈ లియో ఎవరు? యాంటోని, హెరాల్డ్ కథేంటి? హీరో తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. హీరో అతని ఫ్యామిలీ సరదాగా గడపడం. హీరోపై అటాక్ జరగడం వంటివి చూపించి హీరోకి లియోకి పోలికలు ఉన్నాయని చూపించి అక్కడ్నుంచి సినిమా అంతా అతను లియోనా కదా అని తెలుసుకోడానికి సాగదీశారు. లోకేష్ గత సినిమాల్లాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో డ్రగ్స్ సరఫరా లాంటి అంశాలు తీసుకున్నాడు. సినిమా మొదట్లోనే కథ అర్దమైపోయినా చివరి క్షణం వరకు ఆసక్తిగా చూసేలా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే కలిపి రెండు పాత్రలని తీసుకొచ్చాడు డైరెక్టర్.

Also Read : భగవంత్ కేసరి రివ్యూ.. ఈసారి బాలయ్య మాస్ కాదు ఎమోషన్ తో మెసేజ్..

లోకేష్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోయిన వాళ్లకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కథ పరంగా అయితే ఇది సాధారణ కథే. మన తెలుగులోనే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్.. అది వదిలేసి ప్రశాంతమైన జీవితం గడపడం, సెకండ్ హాఫ్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ చూపించడం.. అనేది చాలా సినిమాల్లో ఉంది. కానీ లియో సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నది ఇతనేనా కాదా అనే ఓ ఆసక్తికర కథనంతో తెరకెక్కించారు. మరోసారి డైరెక్టర్ గా లోకేష్ సక్సెస్ అయినట్టే. విజయ్ కూడా తన ఏజ్ కి తగ్గ తండ్రి పాత్ర చేయడం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. త్రిష కూడా మిడిల్ ఏజ్డ్ తల్లి పాత్రలో మెప్పించింది. యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, సంజయ్ దత్, మడోనా సెబాస్టియన్.. అందరూ కూడా అదరగొట్టారు. సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు