నా చెట్టు పోయింది సార్..పోలీసులకు 6th క్లాస్ పిల్లాడి ఫిర్యాదు..

  • Publish Date - August 29, 2020 / 11:15 AM IST

నా ‘నీడ’పోయిది సార్..అంటూ ఓ తెలుగు సినిమాలో ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఓ పిల్లాడు పోలీసులకు దగ్గరకొచ్చి ‘‘నా చెట్టు పోయింది సార్’’అంటూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. తరువాత విషయం తెలుసుకుని నవ్వేసుకున్నారు. ఆ మొక్కలంటే ఆ పిల్లాడికి ఉన్న్ మమకారం తెలుసుకుని ముగ్ధులయ్యారు..ఆ తరువాత ఆ పిల్లాడు ‘చిరి’అనే మొక్కల పంపిణీ ప్రోగ్రామ్ వారికి కూడా ఫిర్యాదు చేవాడు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగిన ఈ ఆసక్తికర ఘటనకు గురించి అసలు విషయం ఏంటంటే..



పవన్ నాశ్ అనే 6th క్లాస్ చదివే పిల్లాడు రెండు సంవత్సరాల క్రితం ఓ ఉసిరి మొక్క నాటాడు. లాక్ డౌన్ తో స్కూళ్లు మూసివేయటంతో చుట్టాల ఇంటికి వెళ్లాడు. అలా వెళ్లిన పవన్ గత సోమవారం ఇంటికి వచ్చాడు. వచ్చీరాగానే తాను ఎంతో ప్రేమగా పెంచుకునే ఉసిరి మొక్క ఎంత పొగుడు ఎదిగిందో చూసుకుందామని ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్లాడు.కానీ అక్కడ తాను పెంచుకునే మొక్క కనిపించలేదు. దీంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రెండు అడుగులు పొడవు ఎదిగిన మొక్క కనిపించకుండా పోయేసరికి ఏడుపు వచ్చేసింది పవన్ కి.. ఆ మొక్క సగానికి నరికేసినట్లుగా ఉంది.

సగం నరికేసిన మొక్కకు చూసుకుని పవన్ ఒకటే ఏడుపు..ఏడ్చీ ఏడ్చీ ఆఖరికి ‘చిరి’కి ఫోన్ చేసి రెండేళ్ల నుంచి తాను పెంచుకునే మొక్క ‘రెండు ఏళ్లు అయ్యింది కాబట్టి చెట్టు అని కూడా అనవచ్చు) కనిపించకుడా పోయిందని చెప్పుకుని ఏడ్చాడు. కాగా..లాక్‌డౌన్ సమయంలో కేరళ ప్రభుత్వం చిన్నారుల మానసిక క్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌన్సెలింగ్ కార్యక్రమమే ‘చిరి’ (నవ్వు). ఈ కార్యక్రమం ద్వారా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిపోయిన చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రభుత్వం ‘చిరి’ని చేపట్టింది.పిల్లకు మొక్కలు పంచి వాటిని జాగ్రత్తగా పెంచమని సూచించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు చాలా ఉత్సాహంగా పాల్గొనటంతో ఆ ప్రోగ్రామం విజయవంతమైంది. మీరు పెంచుకునే మొక్కల గురించి మీకేమన్నా వివరాలు కావాలంటే ‘చిరి’కి ఫోన్ చేయమని అధికారులు సూచించారు.



దీంతో తాను ప్రేమగా పెంచుకుంటున్న మొక్కను ఎవరో నరికేశారని వలవలా ఏడుస్తూ పవన్ ‘చిరి’కి మొరపెట్టుకున్నాడు. పవన్ బాధను అర్థం చేసుకున్న ఆ అధికారి ఆ విషయాన్ని తన పై అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో చిరి నోడల్ అధికారి, ఐజీపీ విజయన్ సూచనతో న్జారక్కల్ పోలీసులు 9 మొక్కలు పట్టుకుని పవన్ ఇంటికి వెళ్లి పవన్ ను సర్ ప్రైజ్ చేశారు.
https://10tv.in/lockdown-brings-spotlight-on-online-gaming-addiction/
పోలీసులు ఇంటికి రావటంతో పవన్, అతడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఏంటీ సార్..అని కంగారుపడిపోయారు. అసలు విషయం చెప్పేసరికి..ఓరి గడుగ్గాయి కంగారు పెట్టేశావు కదారా..అని ముద్దుగా పవన్ నెత్తిమీద కొట్టారు అమ్మానాన్నలు..



పోలీసులు పవన్ కోసం తీసుకొచ్చిన ఆ 9 మొక్కల్లో ఉసిరి మొక్కతో పాటు చింత, జామ మొక్కలు కూడా ఉన్నాయి. ఆ మొక్కలను చూసి పవన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ పోయిన తన మొక్కను మాత్రం పదేపదే తలుచుకుంటున్నాడు. కానీ ఏం చేస్తాం..ఈ మొక్కల్ని కూడా అంతే జాగ్రత్తగా శ్రద్ధగా పెంచాలని పవన్ నిర్ణయించుకుని వాటిని నాటాడు. కాగా..పవన్ ఉసిరి మొక్క విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో కొచ్చికి చెందిన సీసీటీవీ సంస్థ స్మార్ట్ గార్డ్ పవన్‌కు సీసీటీవీ కెమెరాను బహుమతిగా అందజేసింది.

ట్రెండింగ్ వార్తలు