Chandigarh University: అవన్నీ అబద్ధాలు.. విద్యార్థినుల ప్రైవేట్ వీడియో లీకులపై బాంబ్ పేల్చిన యూనివర్సిటీ

ఇదే యూనివర్సిటీలో ఎంబీయే చదువుతోన్న ఒక విద్యార్థిని.. 60 మందికి పైగా ప్రైవేటు వీడియోలు తీసినట్టు, అవన్నీ తన బాయ్‭ఫ్రెండ్‭కు పంపినట్లు ఒప్పుకుంది. అంతే కాకుండా ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం వీటన్నిటీ కొట్టిపారేస్తూ.. అన్నింటినీ అబద్ధాలని చెప్పడం గమనార్హం.

Chandigarh University: విద్యార్థినుల వీడియోలు లీకు వ్యవహారంపై చండీగఢ్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. శనివారం రాత్రి నుంచి వందలాది మంది విద్యార్థులు ఈ విషయమై పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. మరోవైపు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ తరుణంలో యూనివర్సిటీ యాజమాన్యం ఈ విషయమై స్పందిస్తూ ఒక్కసారిగా బాంబులాంటి ప్రకటన చేసింది. ఏ విద్యార్థిని వీడియో ప్రైవేటు వీడియోలు లీక్ కాలేదని, ఏ విద్యార్థినీ ఆత్మహత్యకు పాల్పడలేదని, విద్యార్థులు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, అసత్యాలని యూనివర్సిటీ యాజమాన్యం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

‘‘ఏడుగురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్లు వచ్చిన రుమార్లన్నీ అవాస్తవం. ఏ ఒక్క విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం చేయలేదు. ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు. విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు బయటికి వచ్చాయనేది పూర్తిగా అవాస్తవం. అభ్యంతకరంగా ఉండే ఏ ఒక్క విద్యార్థినికి సంబంధించిన వీడియో బయటికి రాలేదు. ఇక ఒక విద్యార్థి ఈ వీడియోలు తీసి బాయ్‭ఫ్రెండ్‭కు పంపిందన్న విషయం కూడా కేవలం రూమర్ మాత్రమే’’ అని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది.

విచిత్రం ఏంటంటే.. ఇదే యూనివర్సిటీలో ఎంబీయే చదువుతోన్న ఒక విద్యార్థిని.. 60 మందికి పైగా ప్రైవేటు వీడియోలు తీసినట్టు, అవన్నీ తన బాయ్‭ఫ్రెండ్‭కు పంపినట్లు ఒప్పుకుంది. అంతే కాకుండా ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం వీటన్నిటీ కొట్టిపారేస్తూ.. అన్నింటినీ అబద్ధాలని చెప్పడం గమనార్హం. రెండు రోజులుగా యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులు నిరసన చేస్తున్నారు. దానిపై మాత్రం యూనివర్సిటీ స్పందించలేదు.

Chandigarh University: తోటి విద్యార్థినుల నగ్నవీడియోలు తీస్తూ ఆన్‭లైన్‭లో అప్‭లోడ్.. ఇప్పటికే 60కి పైగా.. అట్టుడికి పోతున్న యూనివర్సిటీ

ట్రెండింగ్ వార్తలు