Coronavirus Cases : కొవిడ్ కేసుల వ్యాప్తిపై కేంద్రం అలర్ట్…పిరోలా, ఎరిస్ వేరియెంట్లపై రాష్ట్రాలు అప్రమత్తం

దేశంలో మరోసారి ప్రబలుతున్న కొవిడ్ కొత్త వేరియెంట్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిరోలా, ఎరిస్‌ఫైల్ ఫోటో వంటి కొవిడ్ కొత్త వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది.....

Coronavirus Cases

Coronavirus Cases : దేశంలో మరోసారి ప్రబలుతున్న కొవిడ్ కొత్త వేరియెంట్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిరోలా, ఎరిస్‌ఫైల్ ఫోటో వంటి కొవిడ్ కొత్త వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్, క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఉన్నత స్థాయి కొవిడ్ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. (Centre Reviews Covid-19 Situation) దేశంలో కొత్త వేరియెంట్లు ప్రబలుతున్నందున మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు.

Shejal : బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తా, ఎలా గెలుస్తాడో చూస్తా- శేజల్ హాట్ కామెంట్స్

కొత్త గ్లోబల్ వేరియంట్‌లపై నిశితంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. (To Keep Eye On New Variants) కొవిడ్ కొత్త వేరియెంట్ ఎరిస్ ప్రపంచంలోని 50 దేశాల్లో ప్రబలిందని, మరో పిరోలా వేరియంట్ 4 దేశాల్లో ఉందని ప్రధాని సలహాదారు అమిత్ ఖరే, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ చెప్పారు. గత 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ జనాభాలో 17శాతం ఉన్న భారత్‌లో కేవలం 223 కేసులు (0.075%) మాత్రమే నమోదయ్యాయి. దేశంలో కొవిడ్-19 పరిస్థితి నిలకడగా ఉన్నా దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలు సన్నద్ధమవుతున్నాయని పీకే మిశ్రా చెప్పారు.

Rekha Nayak : కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? అధికార పార్టీలో ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు

ఇన్‌ఫ్లుఎంజా వంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కేసులను రాష్ట్రాలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. భారతదేశంలో 1,475 యాక్టివ్ కరోనావైరస్ కేసులు సోమవారం నాటికి నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1,010 క్రియాశీల కేసులు, పశ్చిమ బెంగాల్ లో 182, మహారాష్ట్రలో 116 కేసులు వెలుగుచూశాయి. 2020వ సంవత్సరంలో భారతదేశంలో కొవిడ్ -19 వ్యాప్తి చెందినప్పటి నుంచి 4.44 కోట్ల మందికి పైగా ప్రజలు కోలుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు