Rekha Nayak : కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? అధికార పార్టీలో ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖా నాయక్ ను కాదని సీఎం కేసీఆర్ ఖానాపూర్ టికెట్ ను జాన్సన్ నాయక్ కు ఇచ్చారు. Rekha Nayak - Khanapur

Rekha Nayak - Khanapur (Photo : Google)

Rekha Nayak – Khanapur : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ లో అసంతృప్తుల సెగ మొదలైంది. బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది.

టికెట్ దక్కకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. మంగళరం (ఆగస్టు 22) కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరిపోయారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖా నాయక్ ను కాదని సీఎం కేసీఆర్ ఖానాపూర్ టికెట్ ను జాన్సన్ నాయక్ కు ఇచ్చారు.

Also Read..BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..

అటు.. ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే MVI ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నారు శ్యామ్ నాయక్. ఆదిలాబాద్ జిల్లా మాజీ టిజిఓ అధ్యక్షుడిగా ఉన్నారాయన. శ్యామ్ నాయక్ కి ఆసిఫాబాద్ టికెట్ పై కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఎమ్మెల్యే రేఖానాయక్ కి సైతం టచ్ లోకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్లు. 50 రోజుల తన ఎమ్మెల్యే పదవి పూర్తయ్యాక ఆలోచిస్తానని రేఖా నాయక్ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని రేఖానాయక్ ప్రకటించారు. కాగా, రేఖానాయక్ రేపే కాంగ్రెస్ లో చేరతారని ఖానాపూర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read..BRS List: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్

ట్రెండింగ్ వార్తలు