IndiGo Aircraft: టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

విమానం టేకాఫ్ అయ్యే సమయంలో అకస్మాత్ముగా ఇంజిన్ భాగంలో నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో మేము భయాందోళనకు గురయ్యాం. విమానంలో వృద్ధులు, పిల్లలు చాలా మంది ఉన్నారు. మంటలు వ్యాప్తిచెందుతున్న క్రమంలోనే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళం వచ్చింది. క్షణాల్లో అంతా జరిగిపోయింది.

IndiGo Aircraft: బెంగళూరుకు బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఇండిగో విమానం 6E-2131 ఇంజన్ లో ఒకదానిలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలెట్ ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపివేశారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి హానిజరగలేదు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ఉన్నారు.

IndiGo Flight: రన్‌వేపై జారిన ఇండిగో విమానం.. నిలిపివేసిన అధికారులు

రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినప్పటికీ ప్రయాణికులను వెంటనే బయటకు తీసుకురాలేదు. రాత్రి 11 గంటల తర్వాత విమానం నుంచి ప్రయాణీకులు బయటకువచ్చి అర్ధరాత్రి సమయంలో మరో విమానంలో వెళ్లారు. ఈ విషయంపై ఓ ప్రయాణికుడు ఈ సంఘటన యొక్క వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక ఇంజిన్ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడటం చూడొచ్చు.

ఈ విషయంపై మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో అకస్మాత్ముగా ఇంజిన్ భాగంలో నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో మేము భయాందోళనకు గురయ్యాం. విమానంలో వృద్ధులు, పిల్లలు చాలా మంది ఉన్నారు. మంటలు వ్యాప్తిచెందుతున్న క్రమంలోనే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళం వచ్చింది. క్షణాల్లో అంతా జరిగిపోయింది. విమానాన్ని పార్కింగ్ బేకు తరలించారు. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారని ప్రయాణికులు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు