Uppal Stadium : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం.. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లకు 1200 మందితో భారీ బందోబస్తు, బ్లాక్ టికెట్స్ పై స్పెషల్ ఫోకస్

కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తామని పేర్కొన్నారు. గ్రౌండ్ కి వచ్చిన ప్రతీ ఒక్కరు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40 వేలు అని తెలిపారు.

CP Chauhan

Uppal Stadium – CP Chauhan : భారత గడ్డపై వన్డే క్రికెట్ వరల్డ్ కప్ జరుగనుంది. మెగా ఈవెంట్ లో 10 జట్లు వార్ కు సిద్ధమయ్యాయి. దేశంలోని 10 క్రికెట్ స్టేడియాల్లో 46 రోజులపాటు జరుగున్న ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత గడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలో మ్యాచ్ లు మొత్తం 10 నగరాల్లోని వేదికల్లో జరుగనున్నాయి. వీటిలో అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, లక్నో, ధర్మశాల, పూణే, హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచ్ లు జరుగున్నాయి.

ఇందులో రెండు మ్యాచ్ లు పాకిస్థాన్ జట్టు ఆడేవే ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10తేదీల్లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీపీ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచ్ లు పూర్తయ్యాయని తెలిపారు. మరో మూడు ప్రధాన మ్యాచ్ లు జరగబోతున్నాయని చెప్పారు.మ్యాచ్ లు సజావుగా జరిగేలా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

ODI World Cup 2023 : భారత్ గడ్డపై క్రికెట్ పండుగ షురూ.. వార్ కు సిద్ధమైన పది జట్లు.. మెగా టోర్నీలో ముఖ్యమైన విశేషాలు ఇవే..

మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి గేట్లు ఓపెన్ చేసి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పారు. వార్మప్ మ్యాచ్ లకు ఎలాంటి డైవర్షన్స్ పెట్టలేదు కానీ, మూడు మెయిన్ మ్యాచ్ లకు కొన్ని డైవర్షన్స్ పెడతామని పేర్కొన్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘాలో ఉండేలా ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 30 మంది సిబ్బంది కెమెరాలను పరిశీలిస్తుంటారని వెల్లడించారు.

వరల్డ్ కప్ మ్యాచ్ లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఉత్సాహంగా మ్యాచ్ లు చూడటానికి వస్తారని వెల్లడించారు. ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల క్రితం హెచ్ సీ ఏ తో మీటింగ్ నిర్వహించామని తెలిపారు. ఐపీఎల్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని గుర్తు చేశారు.

Asian Games 2023 : టీ20 క్రికెట్ చరిత్రలో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు

ఇక్కడికి వచ్చే టీమ్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నారు. పార్కింగ్ విషయంలో స్పెషల్ ప్లాన్ చేశామని వెల్లడించారు. పార్కింగ్ ప్లేసెస్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ అడ్వైజరీ కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. బయటి నుంచి ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ గ్రౌండ్ లోకి అనుమతి లేదన్నారు.

కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తామని పేర్కొన్నారు. గ్రౌండ్ కి వచ్చిన ప్రతీ ఒక్కరు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40 వేలు అని తెలిపారు. మ్యాచ్ అయిపోయిన అందరూ ఒకేసారి బయటకి వెళ్లకుండా… మెల్లగా వెళ్ళాలని సూచించారు. క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ గ్రౌండ్ లోపల బయట మఫ్టీలో ఉంటారని పేర్కొన్నారు. ప్రేక్షకులకు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని హెచ్ సీ ఏకి సూచించామని తెలిపారు. బ్లాక్ టికెట్స్ అమ్మేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు