Asian Games 2023 : టీ20 క్రికెట్ చరిత్రలో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు

ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో అతను టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు.

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal : టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీ20 క్రికెట్ ఫార్మాట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో భారత్, నేపాల్ జట్లు మధ్య టీ20 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. మంగళవారం ఉదయం హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్ సెంచరీ కొట్టాడు.
Read Also : ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఏ జట్టుపై ఎక్కువసార్లు గెలిచిందో తెలుసా? జట్ల వారిగా పూర్తి వివరాలు ఇలా ..

యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. దీంతో జైస్వాల్ టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా జైస్వాల్ నిలిచాడు. 21 సంవత్సరాల 279 రోజుల వయస్సులో అతడు ఈ ఘనతను సాధించాడు. మరోవైపు ఆసియా క్రీడల్లో మొదటి సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు.

Read Also : ODI World Cup 2023 Prize Money : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు రూ.33 కోట్లు.. ర‌న్న‌ర‌ప్‌కు ఎంతిస్తారంటే..?

భారత్ తరపున టీ20 ఫార్మాట్ లో సెంచరీలు చేసిన అతి చిన్న వయస్సులైన బ్యాటర్లలో శుభ్ మన్ గిల్, సురేష్ రైనా, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. గిల్ 23ఏళ్ల 146 రోజుల వయస్సులో సెంచరీ చేయగా, సురేశ్ రైనా 23ఏళ్ల 156 రోజుల వయస్సులో సెంచరీ కొట్టాడు. కేఎల్ రాహుల్ 24ఏళ్ల 131 రోజుల వయస్సులో టీ20 ఫార్మాట్ లో సెంచరీ బాదాడు.

 

ట్రెండింగ్ వార్తలు