ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఏ జట్టుపై ఎక్కువసార్లు గెలిచిందో తెలుసా? జట్ల వారిగా పూర్తి వివరాలు ఇలా ..

భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది.

Team india

ICC Cricket World Cup 2023 : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు పది జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ 5వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ జట్టు ఆ నెల 8న తొలిమ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతుందిను. అయితే, ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ చరిత్రలో భారత్ జట్టు ఎన్ని మ్యాచ్ లు ఆడింది..? ఏ జట్టుపై అత్యధిక సార్లు విజయం సాధించింది..? ఏ జట్టుపై ఎక్కువ సార్లు ఓడిపోయింది అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఒక్క మ్యాచే గెలిచిన అఫ్గాన్‌.. ఈ సారి మూడు రోజుల ముందు కీల‌క నిర్ణ‌యం

2011 World Cup winning india team

భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది. అయితే.. 1975లో క్రికెట్ వరల్డ్ కప్ ను ప్రారంభించినప్పటి నుంచి భారత్ జట్టు మొత్తం 89 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 53 మ్యాచ్ లలో విజయం సాధించగా.. 33 మ్యాచ్ లలో ఓడిపోయింది. మూడు మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

India win 1983 World Cup

Read Also : ODI World Cup 2023 : ప్ర‌పంచ క‌ప్‌లో సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే..?

ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా ఏ జట్టుపై ఎన్ని మ్యాచ్ లు ఆడిందంటే.. 

⇒  వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుపై అత్యధిక సార్లు విజయం సాధించింది. ఈ జట్టుపై ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించింది. మొత్తం ఏడు సార్లు వరల్డ్ కప్ చరిత్రలో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడగా.. ఏడు సార్లు కూడా భారత్ జట్టు విజయం సాధించింది.
⇒  వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాతో టీమిండియా 12సార్లు తలపడింది. ఇందులో నాలుగు మ్యాచ్ లు విజయం సాధించగా.. ఎనిమిది మ్యాచ్ లలో ఓడిపోయింది.
⇒  శ్రీలంక జట్టుపై భారత్ జట్టు తొమ్మిది సార్లు తలపడింది. ఇందులో నాలుగు సార్లు విజయం సాధించగా.. నాలుగు సార్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
⇒  ఇంగ్లాండ్ పై మొత్తం ఎనిమిది మ్యాచ్ లలో భారత్ తలపడగా.. మూడు మ్యాచ్ లలో భారత్ జట్టు విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ లలో ఓడిపోగా.. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.
⇒  వెస్టిండీస్ జట్టుతో టీమిండియా తొమ్మిది మ్యాచ్లలో తలపడింది. ఇందులో ఆరు మ్యాచ్ లలో విజయం సాధించగా.. మూడింటిలో ఓడిపోయింది.
⇒  జింబాబ్వే జట్టుతో టీమిండియా వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొమ్మిది సార్లు తలపడింది. ఇందులో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి.. ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.
⇒  కెన్యా పై టీమిండియా నాలుగు మ్యాచ్ లు ఆడగా.. అన్నింటిలో విజేతగా నిలిచింది.
⇒  న్యూజిలాండ్ జట్టుతో మొత్తం 8 మ్యాచ్ లలో ఇండియా తలపడగా.. మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది.
⇒  సౌతాఫ్రియా జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా.. మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది.
⇒  బంగ్లాదేశ్ జట్టుతో మొత్తం మూడు మ్యాచ్ లలో టీమిండియా తలపడింది. ఇందులో మూడింటిలో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ లో ఓడిపోయింది.
⇒  నెథర్లాండ్ జట్టుపై రెండు, ఐర్లాండ్ జట్టుపై రెండు మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటిలో విజయం సాధించింది.
⇒ బెర్ముడా, యూఏఈ, నమీబియా, ఈస్ట్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా ఒక్కో మ్యాచ్ ఆడింది. అన్నింటిలో విజయం సాధించింది.

Teamindia in world cup matchs

ట్రెండింగ్ వార్తలు