Clive Madande : అయ్య బాబోయ్‌.. ఇలాంటి వికెట్ కీప‌ర్ మాకొద్దు.. ఇత‌నుంటే ప‌క్క‌వాళ్లు ఈజీగా గెల‌వొచ్చు..!

జింబాబ్వే వికెట్ కీప‌ర్ క్లైవ్ మదాండే ఎవ‌రూ కోరుకోని ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Zimbabwe Cricketer Registers Unwanted Record First Time In 147 Years

Clive Madande : జింబాబ్వే వికెట్ కీప‌ర్ క్లైవ్ మదాండే ఎవ‌రూ కోరుకోని ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో అత‌డు దీన్ని న‌మోదు చేశాడు. ఓ ఇన్నింగ్స్‌లో బైస్ రూపంలో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న వికెట్ కీప‌ర్‌గా ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. కాగా.. అత‌డికి ఇది అరంగ్రేట టెస్టు మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం.

మందాడే పేల‌వ వికెట్ కీపింగ్‌కు తోడు బౌల‌ర్ల అనూహ్య స్వింగ్ కూడా తోడు కావ‌డంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 59 ప‌రుగుల‌ను ఎక్స్‌ట్రాలుగా ఇచ్చింది. ఇందులో 42 ప‌రుగులు బైస్ రూపంలోనే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో 90 ఏళ్ల చెత్త రికార్డును బ్రేకైంది. 1934లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వికెట్ కీప‌ర్‌ లెస్ అమెస్ 37 ప‌రుగుల‌ను బైస్ రూపంలో ఇచ్చాడు. తాజాగా దీన్ని 24 ఏళ్ల మ‌దాండే అధిగ‌మించాడు.

Olympics 2024 : హాలీవుడ్ అందాలు, ఈఫిల్ టవర్‌పై లైట్ షో.. ఒలింపిక్ ఆరంభ వేడుకలు అదుర్స్.. వీడియోలు వైరల్

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ వికెట్ కీప‌ర్ 40 కి పైగా ప‌రుగులు బైస్ రూపంలోనే ఇవ్వ‌డం ఇదే తొలిసారి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 71.3 ఓవ‌ర్ల‌కు 210 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మ‌స్‌వ‌రె(74) హాఫ్ సెంచ‌రీ చేశాడు. గుంబీ(49), సీన్ విలియ‌మ్స్ (35) ప‌రుగులు చేశాడు. వికెట్ కీప‌ర్ మ‌దాండే గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. ఐరీష్ బౌల‌ర్ల‌లో బ్యారీ, ఆండీలు చెరో మూడు వికెట్లు తీశారు.

అనంత‌రం ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250 ప‌రుగులు చేసింది. మూర్ (79) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఆ త‌రువాత ఎక్స్‌ట్రాలు 59 ప‌రుగులు రెండో అత్య‌ధికం కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌రువాత ఆండీ 28 ప‌రుగులు ఉన్నాయి. దీంతో ఐర్లాండ్‌కు 40 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే వికెట్ న‌ష్ట‌పోకుండా 12 ప‌రుగులు చేసింది.

IND vs SL : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు ముందు భార‌త్‌కు షాక్‌..

ట్రెండింగ్ వార్తలు