CJI NV Ramana : సీఎం కేసీఆర్ న్యాయయవ్యవస్థకు మిత్రుడు.. : జస్టిస్ ఎన్వీ రమణ

‘సీఎం కేసీఆర్ న్యాయవ్యవస్థకు మిత్రుడు..చేతికి ఎముక లేని వ్యక్తి’అంటూ తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో సీజేఐ ఎన్‌.వి.రమణ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

CJI Justice NV Ramana on KCR: తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించిన సందర్భంగా సీజేఐ ఎన్‌.వి.రమణ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ‘సీఎం కేసీఆర్ న్యాయవ్యవస్థకు మిత్రుడు అనీ..చేతికి ఎముక లేని వ్యక్తి కేసీఆర్ అంటూ ప్రశంసించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ..కోర్టులో మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల భర్తీ అనేది చాలా ముఖ్యం..పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటేనే కేసుల విచారణ వేగవంతమౌవుతుందని అన్నారు. ఈ ఆలోచనతో నే తెలంగాణ హైకోర్టు బెంచ్ ల సంఖ్య 24 నుంచి 42కు పెంచామని తెలిపారు.

Also read : Maharashtra : “RSS ఆసుపత్రిలో హిందువులకు మాత్రమే వైద్యం చేస్తారా…?”మంత్రి గడ్కరిని ప్రశ్నించిన రతన్ టాటా

తెలంగాణ విభజన తరువాత తొలిసారిగా జ్యుడీషియన్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరుగుతోందని..న్యాయవ్యవస్థను బలోపేతం చేయటానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో దాదాపు 4,320 ఉద్యోగాల్ని కేసీఆర్ క్రియేట్ చేశారని ఈ సందర్భంగా ఎన్వీ రమణ గుర్తు చేశారు. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిస్తున్న క్రమంలో ఇక్కడ మాత్రం పెంచడం ప్రశంసనీయమని కొనియాడారు.

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లాంటిదాన్ని కూడా ఏర్పాటు చేయడం, అందుకు స్థలం, నిధులు కేటాయించడం పట్ల కూడా జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. అది కేసీఆర్ వల్లే సాధ్యమని, దాని ఏర్పాటు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

న్యాయమూర్తులు, న్యాయసిబ్బంది అంతా కరోనా భయం నుంచి బయటపడాలని ఇకపై కోర్టులకు కోసం సీరియస్‌గా అదనపు సమయం వెచ్చించాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. లక్ష్య సాధన కోసం సమర్థమైన విధానాలు చాలా మంచి ఫలితాలు చూపుతాయని అన్నారు. న్యాయవ్యవస్థ కీర్తి పతాక రెపరెపలాడేలా అంతా పని చేయాలని కోరారు. జిల్లా కోర్టుల వ్యవస్థ అనేది మొత్తం న్యాయ వ్యవస్థకు పునాది లాంటిదని..ఆ పునాది గట్టిగా ఉంటేనే న్యాయవ్యవస్థ బలంగా ఉంటుందని అన్నారు.

Also read : Akhand Bharat : ‘అఖండ భారతం’ త్వరలోనే సాకారమవుతుంది..దీన్ని ఎవ్వరూ ఆపలేరు : RSS చీఫ్ మోహన్ భగవత్

ఈ కాన్ఫరెన్స్ లో ముందుగా న్యాయాధికారులను ఉద్దేశించి అధికారికంగా ఇంగ్లీషులో ట్లాడిన సీజేఐ.. అనంతరం సీఎం కేసీఆర్ గురించి తెలుగులో ప్రసంగించారు. తెలుగు నేలపై, తెలుగు వాడిగా తనకు తెలుగులో మాట్లాడాలనే ఉంటుందని జస్టిస్ ఎన్వీ రమణ అంటూ తెలుగులో ప్రసంగించారు.

ట్రెండింగ్ వార్తలు