తెలంగాణలో సంచలన మార్పులకు పార్టీల శ్రీకారం..! కొత్త అధ్యక్షుడి ఎంపికపై ముమ్మర కసరత్తు

ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి?

Telangana Politics : తెలంగాణలో రాజకీయ పార్టీలు మార్పులు కూర్పుల దిశగా ముందుకు సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సంస్థాగతంగా సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పార్టీల రాష్ట్ర అధ్యక్షుల నియామకాలపై ఫోకస్ పెట్టాయి కాంగ్రెస్, బీజేపీ. ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి? ఎలాగూ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఆల్రెడీ ఉన్నారు. అడిషనల్ గా ఇంకేమేమి చేయాలి? ఈ దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

పార్టీల్లో సంస్థాగత మార్పులు..
తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. అప్పటివరకు రాజకీయ పార్టీల నేతలకు కొంత గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో.. ఆయా పార్టీల్లో ఎలాంటి సంస్థాగత మార్పులు చేయాలి? అనేదానిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ని తొలగించిన ఆయన స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.

బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు?
కాగా, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకు మాత్రమే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటారని ముందుగానే జాతీయ స్థాయి నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. దాంతో దాదాపుగా జూన్ నెలలోనే కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఖాయం. అదే నెలలోనే బీజేపీలో అధ్యక్ష మార్పు ఉండబోతోంది.

పీసీసీ పగ్గాలు ఎవరికి?
ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఆయన కృషికి ఫలితం దక్కింది. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో కాంగ్రెస్ కూడా కచ్చితంగా పీసీసీ అధ్యక్షుడిని మార్చబోతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడు రానున్నారు.

పార్టీ బలోపేతం దిశగా కేసీఆర్ అడుగులు..
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటి నుంచి కూడా కేసీఆర్ ఉన్నారు. 2019లో బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టింది. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్ కి కట్టబెట్టారు. అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇద్దరూ.. ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే అనుకున్న ఫలితాలు రాలేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. మళ్లీ కార్యకర్తలను, పార్టీని పునరుత్తేజం చేసేందుకు క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

హరీశ్ రావుకి ప్రాధాన్యత..!
అధికారంలో ఉన్న పదేళ్లు పార్టీని పట్టించుకోలేదు, సంస్థాతగతంగా నిర్మించలేదనే ఒక విమర్శ ఉంది. ఎన్నికలకు ఒక ఏడాది ముందు మాత్రమే అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులను మాత్రమే నియమించింది తప్పితే రాష్ట్ర కార్యవర్గం కానీ జిల్లా కార్యవర్గం కానీ ఎక్కడా లేదు. కాబట్టి కార్యవర్గ నిర్మాణాలతో పాటు, బీఆర్ఎస్ లో ఉన్న మరో కీలక నేత హరీశ్ రావుకి కొంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా మూడు ప్రధాన పార్టీల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఆ పార్టీల్లో ఏం జరగబోతోంది? లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులు ఉండనున్నాయి? ఉన్న నాయకత్వాన్ని ఎలా కూర్పు చేయబోతున్నారు? ఇలాంటి అంశాలపై స్పెషల్ అనాలసిస్.. ”చక్రం తిప్పే రాష్ట్ర అధ్యక్షులు ఎవరు?”

Also Read : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..!

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు