ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదు: జగ్గారెడ్డి 

Jagga Reddy: గుర్తింపు కోసమే ఉత్తమ్‌పై మహేశ్వర రెడ్డి విమర్శలు చేస్తున్నారని..

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మంత్రి ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి అని చెప్పారు. అటువంటి వైట్ పేపర్‌పై సిరా ఎందుకు చల్లుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేత మహేశ్వర రెడ్డి సిరా చల్లుతున్నారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని అన్నారు. గుర్తింపు కోసమే ఉత్తమ్ పై మహేశ్వర రెడ్డి విమర్శలు చేస్తున్నారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి ఇప్పటికైనా ఇటువంటి చర్యలు ఆపేయాలని అన్నారు.

ఒకవేళ మహేశ్వర రెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో యూట్యాక్స్ బాదుతున్నారంటూ మహేశ్వర రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రైతుల నుంచి వసూలు చేసి యూ ట్యాక్స్‌ పేరుతో మంత్రితో పాటు, అధికారులకు చెల్లింపులు చేస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపైనే జగ్గారెడ్డి మండిపడ్డారు.

కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుంది : బీజేపీ నేత లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు