Drivers strike : బిగ్ అలర్ట్.. రేపు ర్యాపిడో, ఓలా, ఉబర్ సేవలు బంద్..!
Drivers strike : కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఈనెల 7న (శనివారం) దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు.
Drivers strike
Drivers strike : ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఈనెల 7న (శనివారం) దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్‌తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు.
Also Read : Kavitha : మూడు నెలల్లో కొత్త పార్టీ.. బీఆర్ఎస్ ప్రచారం అంత యాక్టివ్‌గా లేదు
సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలకు కనీసం ఆరు గంటల పాటు (ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు) అంతరాయం ఏర్పడనుంది. ఈ సమ్మె సమయంలో రైడ్ హెయిలింగ్ సేవలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కునే చాన్స్ ఉంది. సమ్మెలో పాల్గొనే డ్రైవర్ల సంఖ్యను బట్టి ఆయా ప్రాంతాల్లో సేవల్లో సమ్మె తీవ్రత కనిపించనుంది.
డిమాండ్లు ఇవే..
♦ కనీస ఛార్జీలు, గిగ్ వర్కర్ల పని పరిస్థితులపై ఈ ఆందోళన చేపడుతున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్ పేర్కొంది.
♦ క్యాబ్ సేవలను నియంత్రించేందుకు తీసుకొచ్చిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ -2025 ఉన్నప్పటికీ ఆయా ప్లాట్‌ఫామ్స్ మాత్రం ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయిస్తున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
♦ ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస ఛార్జీలను నిర్ణయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
♦ ప్రైవేట్ వాహనాలను కమర్షియల్ అవసరాలకు వినియోగించడంపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
♦ డ్రైవర్ల ఆదాయానికి రక్షణ కల్పించడంతో పాటు, పని పరిస్థితుల మెరుగు కోరుతూ ఈ సమ్మె చేపడుతున్నారు.
