కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుంది : బీజేపీ నేత లక్ష్మణ్

సర్వేలు చేయకుండా మూకుమ్మడిగా ముస్లీంలను బీసీలలో చేరుస్తున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు.

BJP Laxman : ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తు కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 77ముస్లీం వర్గాలను ఓబీసీలో చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. ముస్లీం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం బెంగాల్ ప్రభుత్వం ఓబీసీ హోదా ఇచ్చిందని, ముస్లీం సంతుష్టికరణకు ఇది చెంపపెట్టు లాంటిదన్నారు. ముస్లీం రిజర్వేషన్లలపై మాట్లాడితే మోదీని తప్పుబట్టారని లక్ష్మణ్ అన్నారు.

Also Read : ఇదేనా సోనియమ్మ రాజ్యం అంటే..? రైతుల కళ్లలో నీరుకాదు రక్తం వస్తుంది : కిషన్ రెడ్డి

సర్వేలు చేయకుండా మూకుమ్మడిగా ముస్లీంలను బీసీలలో చేరుస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా బీసీలలో ముస్లింలను చేర్చారు. బీసీ (ఈ) కింద ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు మేం ఎప్పటి నుంచో తప్పుబడుతున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిపై బీసీ సంఘాలు నిర్ణయం తీసుకోవాలని లక్ష్మణ్ కోరారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలోఉండి కోర్టు తీర్పులకు విరుద్దంగా మాట్లాడుతున్నారు.. కోర్టును అవమాన పరిచేలా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ ఆత్మ క్షోభించేలా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : నిందితుడిని అరెస్టు చేయడానికి కారులో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీసులు

కోర్టును అవమాన పరిచేలా నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని లక్ష్మణ్ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో బీసీలు పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నానని లక్ష్మణ్ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు