నిందితుడిని అరెస్టు చేయడానికి కారులో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీసులు

Viral video: కారు ఎమర్జెన్సీ వార్డుకి రావడంతో రోగుల స్ట్రెచర్లను కొందరు పక్కను నెట్టారు.

నిందితుడిని అరెస్టు చేయడానికి కారులో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీసులు

Cops Drive Car Into Hospital Ward

నిందితుల కోసం పోలీసులు రోడ్డుపై కార్లలో ఛేజ్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే, తాజాగా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఉన్న నిందితుడిని అరెస్టు చేయడానికి కారులో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లారు పోలీసులు. ఇందుకు సంబంధించిన 26 సెకన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఓ మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ నర్సింగ్‌ అధికారి. దీంతో అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇలా ఒక యాక్షన్ మూవీలోని సీన్ లా కారుతో ఆసుపత్రిలోకి దూసుకెళ్లారు. రోగులు, వారి బంధువులతో రద్దీగా ఉండే ఎమర్జెన్సీ వార్డు నుంచి పోలీసులు కారు డ్రైవ్ చేస్తూ వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.

కారుకి ఇరువైపులా బెడ్‌లపై రోగులు కూడా ఉన్నారు. కారు ఎమర్జెన్సీ వార్డుకి రావడంతో రోగుల స్ట్రెచర్లను కొందరు పక్కను నెట్టారు. ఇంత హైడ్రామా మధ్యన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రిషికేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ థియేటర్‌లో నర్సింగ్ అధికారిని అయిన మహిళా డాక్టర్‌పై ఆ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు