India Covid : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 1,249 కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.

India Covid : కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,47,00,667 కి చేరుకుంది.

ప్రస్తుతం దేశంలో 7,927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 5,30,818కు చేరింది . ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి దేశవ్యాప్తంగా 4,41,61,922 మంది పూర్తిగా కోలుకున్నారు.

PM Modi On Covid-19 : దేశంలో మళ్లీ కరోనా కల్లోలం.. ప్రధాని మోదీ కీలక సూచనలు, మాస్కులు మస్ట్

ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కోలుకున్నవారి రేట్ 98.79 శాతం ఉండగా, మరణాల రేట్ 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు