PM Modi On Covid-19 : దేశంలో మళ్లీ కరోనా కల్లోలం.. ప్రధాని మోదీ కీలక సూచనలు, మాస్కులు మస్ట్

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. మాస్కులు ధరించడం, పరిశుభ్రత తదితర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.(PM Modi On Covid-19)

PM Modi On Covid-19 : దేశంలో మళ్లీ కరోనా కల్లోలం రేగింది. మరోసారి కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. అటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కరోనా కేసుల్లో పెరుగుదలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. దేశంలో కరోనా ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. హైలెవెల్ మీటింగ్ లో కీలక సూచనలు చేశారు. మాస్కులు ధరించడం, పరిశుభ్రత తదితర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడేవారు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో వారు కచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు.(PM Modi On Covid-19)

Also Read..Covid Cases In India: దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ.. క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. వారంరోజుల్లో మరణాలు ఎన్నంటే..

కరోనాను ఐదంచెల వ్యూహంతో కట్టడి చేయాలని ప్రధాని చెప్పారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్, మాస్కులు తదితర జాగ్రత్తలు తీసుకోవడం, వేరియంట్లపై నిఘా వంటి ఐదు అంశాల ప్రాతిపదికను కరోనాను ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు కరోనా శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయిస్తుండాలని, తద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని అన్నారు.

Also Read..Ramdev Baba : అల్లోపతి తగ్గించలేని వ్యాధుల్ని కూడా ఆయుర్వేదం తగ్గిస్తుంది : మరోసారి రాందేవ్ బాబా వ్యాఖ్యలు

వైరస్ వ్యాప్తి నివారణకు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. ఆసుపత్రుల్లో రోగులు, డాక్టర్లు, సిబ్బంది మాస్కులు ధరించాలని సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-మాస్క్ విధానాలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేలా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ప్రధాని మోదీ చెప్పారు.

దేశంలో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 6 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ తీవ్రరూపు దాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజారోగ్య వ్యవస్థలు సన్నద్ధమవ్వాల్సిన తీరుపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించారు.(PM Modi On Covid-19)

దేశంలో గత 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 1,134 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా మరో ఐదుగురు కోవిడ్ తో మరణించారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొంతకాలంగా కరోనా మరణాలేవీ లేకపోగా, ఇటీవల మళ్లీ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఛత్తీస్ గఢ్, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో ఒక్కో మరణం నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు