Lord Ganesha Got Aadhaar: గణేషుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చారు

ఆధార్ కార్డులో వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే.. పేరు శ్రీ గణేషుడు, తండ్రి పేరు మహదేవుడు, ఉండేది కైలాసం. అంతే కాదు.. గణేషుడికి ఒక ఆధార్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జార్ఖండ్‌లో హైలెట్‌గా నిలిచింది. జమ్‌షెడ్‌పూర్‌‭కు చెందిన గణేష్ ఉత్సవ నిర్వాహకులకు తట్టిన ఆలోచన ఇది. గణపతి మండపాన్ని ఆధార్ కార్డు నమూనాలో రూపొందించారు

Lord Ganesha Got Aadhaar: దాదాపుగా దేశ ప్రజలందరి వద్ద ఆధార్ కార్డు ఉంది. ప్రతి పనిలో ఆధార్ ప్రమేయం తప్పనిసరి అవుతోంది. మనిషి ఐండెంటియే ఆధార్ అన్నంతగా మారిపోయింది. అయితే ఒక్క మనుషులకేనా? దేవుళ్లకు కూడా ఆధార్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది జార్ఖండ్‭లోని కొందరికి.. అంతే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏకంగా గణనాథుడి పేరుపై ఆధార్ కార్డు సృష్టించేశారు. మండపం ఏర్పాటు చేసి, భారీ ఎత్తున ఆధార్ కార్డు కటౌట్ పెట్టారు. మండపానికి వచ్చిపోయే భక్తులు ఆసక్తితో అక్కడ ఆగి ఆధార్ కార్డులో ఉన్న వివరాలు చదువుతూ ముచ్చట పడుతున్నారు.

ఆధార్ కార్డులో వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే.. పేరు శ్రీ గణేషుడు, తండ్రి పేరు మహదేవుడు, ఉండేది కైలాసం. అంతే కాదు.. గణేషుడికి ఒక ఆధార్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జార్ఖండ్‌లో హైలెట్‌గా నిలిచింది. జమ్‌షెడ్‌పూర్‌‭కు చెందిన గణేష్ ఉత్సవ నిర్వాహకులకు తట్టిన ఆలోచన ఇది. గణపతి మండపాన్ని ఆధార్ కార్డు నమూనాలో రూపొందించారు. ఆధార్ కార్డుపై ఉన్న స్కానింగ్ కోడ్‌ను ఫోన్‌లో ఓపెన్ చేస్తే గణపతికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Cervical Cancer Vaccine: బాలికలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్‭కు వ్యాక్సిన్‌ విడుదల

ట్రెండింగ్ వార్తలు