Manipur violence : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి

మణిపుర్‌లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గ్రామస్థులు మరణించారు....

Manipur violence

Manipur violence : మణిపుర్‌లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గ్రామస్థులు మరణించారు. కాల్పుల అనంతరం గ్రామస్థులకు మూడు మృతదేహాలు కనిపించాయి. (Manipur violence) మృతులను జామ్‌ఖోగిన్ హాకిప్ (26), తంగ్‌ఖోకై హాకిప్ (35), హోలెన్‌సన్ బైట్ (24)గా గుర్తించారు. (fresh violence in Ukhrul)

Kerala : కేరళలో బస్సు బోల్తా…30 మంది ప్రయాణికులకు గాయాలు

షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ ప్రాంతాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర తర్వాత మే 3వతేదీన జాతి ఘర్షణలు చెలరేగాయి.దీంతో మణిపుర్ హింసాత్మకంగా మారింది. హింస చెలరేగినప్పటి నుంచి మణిపుర్ లో 120 మందికి పైగా మరణించారు.

Rajasthan : రాజస్థాన్ బీజేపీ ఎన్నికల కమిటీల్లో మాజీ సీఎంకు దక్కని చోటు

ఈ దాడుల్లో 3వేల మందికి పైగా గాయపడ్డారు. హింసను నియంత్రించడానికి మణిపుర్ రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి స్థానిక పోలీసులతో పాటు 40వేల మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు.

ట్రెండింగ్ వార్తలు