Gujarat Polls: మోదీ నిర్వహించిన అతి పెద్ద రోడ్‭-షోలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారో తెలుసా?

వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన్ని మోదీ ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన అతి పెద్ద రోడ్‭-షోలో దాదాపు 10 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరైనట్లు తెలుస్తోంది. గుజరాత్‭లోని అతిపెద్ద నగరం అహ్మదాబాద్‭లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజధాని గాంధీనగర్లోని ఒక నియోజకవర్గంలో 50 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‭-షో దేశంలోనే అతిపెద్దది. ఇప్పటి వరకు ఇంత పెద్ద రోడ్‭-షో ఎవరూ నిర్వహించలేదు.

Nara Brahmani: లదాఖ్‌లో నారా బ్రాహ్మణి బైక్ యాత్ర.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఏడోసారి అధికారం దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ర్యాలీ రూట్ మ్యాప్ ఎంపికలో ఒక బలమైన ప్రకటన ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదం అనంతరం జరిగిన అల్లర్లలో నరోదా గామ్ ఒకటి. ఈ ప్రాంతం నుంచే ప్రధాని మోదీ తన 50 కిలోమీటర్ల రోడ్‌షోను ప్రారంభించారు. ఠక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వేజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతితో సహా మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో ఈ ర్యాలీ కొనసాగించాలని మొదట అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మొత్తం 14 నియోజకవర్గాల్లో సాగింది. ఈ ర్యాలీ నిర్వహణకు మొత్తం మూడున్నర గంటల సమయం పట్టింది.

GST Revenue: 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. నవంబర్‌లో రూ.1.46 లక్షల కోట్లు వసూలు

వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన్ని మోదీ ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. పండిట్ దిండయాళ్ ఉపాధ్యాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో సహా ప్రముఖ వ్యక్తుల స్మారక చిహ్నాలను దారి పొడవునా 35 స్టాప్‌లు ఏర్పాటు చేశారు. భారత దేశ చరిత్రలో ఇంత పొడవైన ర్యాలీ ఇదేనని బీజేపీ పేర్కొంది.

Noida woman: బయటపడ్డ పాయల్ నాటకం.. మరో మహిళను చంపి.. ఆమె మృతదేహంతో తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించిన యువతి

ట్రెండింగ్ వార్తలు